చెప్పుకునేందుకు ఏమీ లేక చేతగాని ఆరోపణలు… ఏడాది కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి : ఆదాల
– అవకాశం ఇవ్వండి 1500 కోట్లతో నెల్లూరు రూరల్ అభివృద్ధి చేసి చూపిస్తా
– వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
నెల్లూరు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా తొమ్మిదేళ్లు పనిచేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఫలానా అభివృద్ధి కార్యక్రమాన్ని చేశానని చెప్పుకునే దానికి ఏమీ లేక…? నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి శ్రీ, స్థానిక సీనియర్ నేత పిండి సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి, తాను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న ఏడాదిలో జరిగిన అభివృద్ధికి తేడాను కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రూరల్ ను రూ.1500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెంబర్ -1 నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపిస్తానని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి 36వ డివిజన్ వైఎస్ఆర్సిపి శ్రేణులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మే 13వ తేదీ జరగనున్న సాధారణ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవ దళ్ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు లంకా రామ శివారెడ్డి, సిహెచ్ హరిబాబు యాదవ్, ఏసు నాయుడు 36వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.