
*చిరు వ్యాపారికి తోపుడు బండి అందచేసిన వేమిరెడ్డి దంపతులు*
మహిళకు తోపుడు బండి యిచ్చి ఆమె జీవనోపాధికి చేయూత ఇచ్చారు వేమిరెడ్డి దంపతులు.
నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లు బుచ్చిరెడ్డి పాళెం పట్టణ పరిధిలోని కాశీ పాళెం ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారం చేసుకునే రాణి అనే పేద మహిళకు తోపుడు బండి యిచ్చి ఆదుకున్నారు.
వారు ఈ సందర్భంగా జీవనోపాధి కోసం కష్టపడుతున్న చిరు వ్యాపారులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేయూత యివ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లు చేసిన ఈ సహాయం తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చిరు వ్యాపారి రాణి అనే మహిళ వేమిరెడ్డి దంపతుల దాతృత్వాన్ని ప్రశంసించింది.
ఈ కార్యక్రమంలో ఇందుకూరు పేట టిడిపి మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.