SPS నెల్లూరు జిల్లా

*చిన్నబజార్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి ప్రత్యేక తనిఖీలు – నెల్లూరు టౌన్ లో శాంతిభద్రతలపై దృష్టి:నెల్లూరు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష, IPS*

జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష, IPS గారు నేడు చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పనితీరు, గదులు మరియు ఆయా పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు.
🔹 చిన్నబజార్ పరిధిలోని మార్కెట్, మద్రాస్ బస్టాండ్, చాకలి వీధి, కలెక్టరేట్, VRC ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, ప్రజలు–వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
🔹 జనసాంద్రత ఎక్కువగా ఉండే మార్కెట్లు, లాడ్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లాడ్జీల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
🔹 నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులపై కఠిన నిఘా కొనసాగిస్తూ, కౌన్సిలింగ్ నిర్వహించి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🔹 నెల్లూరు టౌన్ లోని అనుమానిత, శివారు ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
🔹 నేడు నెల్లూరు నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను రైల్వే పోలీసులతో సమన్వయం చేసి 2–3 గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
🔹 సంతపేట పరిధిలో ఇటీవల జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును త్వరితగతిన ఛేదించి, పూర్తి రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
🔹 నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో CCTV కెమెరాల జియోట్యాగింగ్ చేపట్టి, పూర్తి CCTV కవరేజ్ కలిగిన నగరంగా నెల్లూరును అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
🔹 నేరాల నియంత్రణ, ఓపెన్ డ్రింకింగ్ అరికట్టడం, విజిబుల్ పోలీసింగ్ బలోపేతం, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
🔹 నిబంధనలు, సమయాలు పాటించకుండా తెరిచి ఉన్న షాపులను మూసివేసి, యజమానులకు చట్టపరమైన సూచనలు చేశారు.

నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం,
తేది: 24-01-2026.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed