*చిత్తూరు జిల్లా కాణిపాకం* లో…PRTU జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
చిత్తూరు జిల్లాలో PRTU జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారి.. పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి *తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* ముఖ్యఅతిథిగా హాజరై..ఉపాధ్యాయుడిగా, PRTU లీడర్ గా ప్రకాష్ రెడ్డి గారు అందించిన సేవలను కొనియాడారు.
అనంతరం *PRTU నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి దంపతులను సత్కరించి మూమెంటో అందజేశారు.*
పదవీవిరమణ అనంతరం ప్రకాష్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
👉 *ప్రకాష్ రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.*
👉 *ప్రకాష్ రెడ్డి గారు ఎంతో మంచి మనసు కల వారాని తెలిపారు.*
👉 *ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రకాష్ రెడ్డి గారు తనతో వెంట ఉండి ఎంతో సహాయ సహకారాలు అందించారని తెలిపారు.*
👉 *ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదే కాకుండా సంతృప్తికరమైనదని అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో.. ప్రకాష్ రెడ్డి గారు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం ఆనందకరమని తెలిపారు .*
👉 *టీచర్స్ ఎమ్మెల్సీగా తాను గత వైసీపీ ప్రభుత్వంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి..పరిష్కారం చూపానని తెలిపారు.*
👉 *రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.*