*(05.01.2026)*

*SPS నెల్లూరు జిల్లా*

*చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం.. నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్.,.*

*ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో 124 ఫిర్యాదులు స్వీకరణ.*

• *ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదు.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు.*
• *’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు.*
• *జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో జిల్లా యస్.పి. గారు స్వయంగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.*

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 124 ఫిర్యాదులు వచ్చాయి.*

*వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..*

1. కావలి పరిధికి చెందినటువంటి మహిళను, తన బంధువైన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన ఫోన్ నెంబర్ తీసుకొని తరచు మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటూ తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా చనువుగా ఉండేవాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మొహం చాటేస్తూ దూరం పెడుతున్నాడని, అడిగితే తన కుటుంబ సభ్యులతో కలిసి గొడవకు వస్తున్నాడని, బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నారని విచారించి న్యాయం చేయాలని కోరారు.
2. నెల్లూరు రూరల్ పరిధికి చెందినటువంటి మహిళను, తన యొక్క ఫోన్ నెంబర్ ని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, అర్ధరాత్రి వేళ ఎక్కువగా అనామకుల కాల్స్, మెసేజులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నారని మానసికంగా వేధిస్తున్నారని విచారించి న్యాయం చేయాలని కోరారు.
3. సైదాపురం పరిధికి చెందినటువంటి వృద్ధుని, తనకు ముగ్గురు కుమారులని, ఒక పెళ్లి కాని కుమార్తె తనతో ఉన్నట్లు, తన కుమారుడు శ్రీను తన ఉంటున్న ఇంటి నుండి తరిమేసినట్లు, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, వేధిస్తున్నారని, తన జీవనోపాధి కోసం ఇచ్చిన ఇంటిని తిరిగి ఇప్పించాలని కోరారు.
4. పొదలకూరు పరిధికి చెందినటువంటి మహిళ, హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు, అదే హాస్పిటల్లో పనిచేస్తున్న నూరుల్లా అనే వ్యక్తి తనతో అన్నలాగా ఉంటూ, తన యొక్క ఫోన్ ని తీసుకొని, వాట్స్ యాప్ లాగిన్ చేసుకున్నాడని, మూడు నెలల క్రితం తనకి పెళ్లి కుదిరినట్లు, తన కుటుంబ సభ్యులకు చేడుగా ప్రచారం చేస్తున్నట్లు, తను చేసుకోబోయే భర్తతో కూడా తప్పుగా చెప్పినట్లు, మానసికంగా వేధిస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
5. నెల్లూరు రూరల్ పరిధికి చెందిన మహిళను, అత్త మానసికంగా వేధిస్తుందని, తన భర్త అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని అంతేకాకుండా తన భర్త, తన యొక్క వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
6. గూడూరు రూరల్ పరిధికి చెందినటువంటి మహిళను, సైదాపురం పరిధికి చెందినటువంటి వినోద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు, పెళ్ళైన రెండు నెలల తర్వాత భర్త కువైట్ కి వెళ్ళినట్లు, వెళ్ళిన తర్వాత వీసా పంపించి నిన్ను కూడా తీసుకెళ్తానని నమ్మబలికి మూడు సంవత్సరాలైనా తీసుకొనిపోలేదని నిలదీయగా, అత్త మామ, ఆడపడుచులతో కలిసి 10 లక్షలు అదనపు కట్నం తెస్తేనే కువైట్ కి తీసుకెళ్తానని ఇబ్బంది పెడుతున్నట్లు, కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని, కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దాలని కోరారు.
7. చిల్లకూరు పరిధికి చెందినటువంటి మహిళ, తనకు ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి అయినట్లు, తన భర్త ఇంటి నుండి ఎటో వెళ్లిపోయాడని, ఆచూకీ కనుగొని అప్పగించాలని కోరారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్ గారు హామీ ఇచ్చారు.

 ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, PCR CI శ్రీ భక్తవత్సల రెడ్డి, మహిళా స్టేషన్ CI శ్రీ సుబ్బారావు గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed