చంద్రబాబు సర్కార్‌లో అతిపెద్ద చిక్కు ముడి
చంద్రబాబు సర్కార్‌లోఅతిపెద్ద చిక్కు ముడి
వైఎస్ షర్మిల: రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం స్తంభించిపోయింది. దీనికింద వైద్య సేవలను అందించడాన్ని అన్ని ఆసుపత్రులు నిలిపివేశాయి. పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌పై ఆసుపత్రులు ఈ సేవలను స్తంభింపజేశాయి.
దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. పలు విమర్శలు సంధించారు. తమ డిమాండ్లను సర్కార్ ముందుంచారు.
పేదవాడి ఆరోగ్యానికి భరోసా అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా అభివర్ణించారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చినా కూడా సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం ఉందనే భరోసా వైఎస్సార్ ప్రభుత్వంలో ఉండేదని అన్నారు.
చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ దీన్ని అనారోగ్యశ్రీగా మార్చిందంటూ షర్మిల మండిపడ్డారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రేనని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ ధ్వజమెత్తారు.

వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలంటూ చంద్రబాబుు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తోన్నామని షర్మిల చెప్పారు. పెండింగ్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని అన్నారు