ఒంగోలు,
16-1-2025,గురువారం
.
*చంద్రబాబు నాయుడు నేనే అన్నీ తెచ్చానంటాడు. అది అబద్ధం.*
*ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది.*
*ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు నిషేధిత సంస్థ. మోహన్ భగవత్ కి ఏమి తెలుసో, తెలియదో నాకైతే తెలీదు*.
*చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు*
మూడు అంశాలు మాట్లాడేదానికి మీ ముందుకొచ్చాను. 1ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల పరిస్థితి, 2 ప్రభుత్వ రంగ సంస్థలు, 3 ఆర్ఎస్ఎస్ భగవత్ వ్యాఖ్యలు.
RSS మోహన్ భగవత్ వ్యాఖ్యలు
****************************
ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు నిషేధిత సంస్థ. మోహన్ భగవత్ కి ఏమి తెలుసో, తెలియదో నాకైతే తెలీదు.
ఆయన రెండు రోజులు నాడు ఉపన్యాసం ఇచ్చాడు. ఒకటో తరగతి పిల్లోడు కూడా ఆ విధంగా మాట్లాడడు. ఆయనంటాడు భారతదేశానికి మొన్ననే స్వాతంత్ర్యం వచ్చిందన్నాడు.
దేవాలయం కట్టిన తర్వాతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు.
రామాలయం కట్టిన తర్వాతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, మోహన్ భగవత్ అన్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ మీ వైఖరి ఏంటి??
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కామెంట్ చేయాలని ఒంగోలు నుంచి మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను.
ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఆర్థిక పరిస్థితి
****************************
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది.
ఒంగోలు జిల్లాలో ఎస్సీల్లో ఒక్కరైనా కోటీశ్వరుడు ఉన్నాడా?? అని అడిగితే లేదు అనే సమాధానం వచ్చింది. ఓబీసీల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.
1994లో విజయ భాస్కర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరిగాయి. ఏడాదికి ముందు అంటే 1993లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్సీలు, ఓబీసీలు ఒక్కటై, యూపీలో మూలయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రయ్యాడు.
ఏపీలో ఓబీసీలను, ఎస్సీలను కలిపేదానికి కాన్సీరామ్ అనే ఒకాయన ఏపీకి వచ్చాడు. ఉత్తరప్రదేశ్లో పరిణామాలు ఆంధ్రప్రదేశ్ పై పడకూడదని ఒక కుట్ర జరిగింది.
ఎస్సీలను ముక్కలు ముక్కలుగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికొచ్చారు. ఆ కుట్ర దారులెవరో వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు.
“దళితుల విభజన వద్దు- కలిసి ఉంటే దేశానికి ముద్దు”
ఎస్సీల్లో దేశవ్యాప్తంగా 850 కులాలున్నాయి. ఒక్క యూపీలోనే 87 ఉప కులాలున్నాయి.
ఎస్సీలను ఏ, బి, సి, డి. లుగా చేయాలని సుప్రీం కోర్టులో ఒక పనికిమాలిన పిటీషన్ పడ్డది. ఆ పిటిషన్ కు ఎవరు డబ్బు ఖర్చు పెట్టారో నేను చెప్పదలుచుకోలేదు. మొత్తానికి పనికిమాలిన జడ్జిమెంట్ వచ్చింది.
సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రభావం యూపీలో, తమిళనాడులో, కేరళలో లేదు. ఏపీలో ఏకసభ్య కమిషన్ వేయడం తప్పు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన ఏకసభ్య కమిషన్ ను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఖండిస్తున్నాను.
మిశ్రా ఒంగోలుకు వస్తే కొట్టుకున్నారంటా!!? కొట్టుకోవడానికి ఏముంది?? ఉద్యోగాల నోటిఫికేషన్లే లేదు.
మిశ్రా ఇంటికి ఎవరైనా పోవాలంటే చెప్పులు బయట తీసి, పోవాలంటా!! ఆఫీసుకు వెళ్లాలన్నా… చెప్పులు వదిలే వెళ్లాలంటా!! అంటరానితనం అంటే ఏమిటో మిశ్రా కి తెలీదు.
ఒకప్పుడు ఎస్సీలను ఊర్లోకి రానిచ్చేవారు కాదు. గుడుల్లోకి రానిచ్చేవారు కాదు. బడుల్లోకి రానిచ్చేవారు కాదు.
మహాత్మా గాంధీ, నెహ్రూ కృషి, అంబేద్కర్ తెలివితేటలు వల్ల ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు వచ్చింది.
ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్, సోనియా గాంధీ కృషి వల్ల ఓబీసీలు విద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు
*******************
వందకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. వేలమందికి ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన మాట వాస్తవం.
కానీ చంద్రబాబు నాయుడు నేనే అన్నీ తెచ్చానంటాడు. అది అబద్ధం. మూడో నాలుగో కంప్యూటర్ కంపెనీలను తెచ్చుంటాడు. నేను కాదనడం లేదు.
జనవరి 8న వైజాగ్ కు ప్రధాని మోడీ వస్తే, ఆ సభలో ఇద్దరు ప్రముఖులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను కాపాడలేకపోయారు.
“ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు” గురించి ఒక్క మాటైనా మాట్లాడతారేమోనని ఆశించాను. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇరువురూ విశాఖ ఉక్కు గురించి మాట్లాడకపోవడం అన్యాయం. మోడీ కూడా విశాఖ ఉక్కును కాపాడతానని అనలేకపోయాడు.
25వేల ఎకరాలు ఉక్కు ఫ్యాక్టరీకి రైతులు ఇచ్చారు. ఈ రోజు ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయలు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ 25 వేల ఎకరాల భూమిని అమ్మి, రెండున్నర లక్షల కోట్లు రూపాయలు వెనకేసుకోవాలనే కుట్రలు జరుగుతోంది.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపతి, విజయేంద్ర పాల్గొన్నారు.