– చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి
– ఎంపి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్య పీడితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారికి వేమిరెడ్డి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లోని వారి నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 7 విడతలుగా 40 మంది అనారోగ్య పీడితులకు 85 లక్షల 65 వేల 387 రూపాయలు మంజూరయ్యాయన్నారు. 7 వ విడతలో ఇందుకూరు పేట కొత్తూరుకు చెందిన షేక్ మనీషా కు 6 లక్షలు, కోవూరు కు చెందిన చింతా అనూష 1 లక్షా 50 వేలు, కొడవలూరు కొత్త వంగల్లు గ్రామానికి చెందిన 85 వేలు, కొడవలూరు గ్రామానికి చెందిన షేక్ నకీబ్ హబీబా 60 వేలు, బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి చెందిన మనోజ్ కుమార్ కు 51 వేలు, కోవూరు గ్రామానికి చెందిన నెల్లూరు నాగరాజ కు 50 వేలు, విడవలూరు గ్రామానికి చెందిన దద్దోలు తిరుపతి 50 వేలు, దామరమడుగు గ్రామవాసి రాగి హాకిష్ 39 వేలు
బుచ్చి మండలం చెల్లాయపాయం వాసి అత్తిపాటి రామకృష్ణ కు 35 వేలు, విడవలూరు కు చెందిన పచ్చిపాల పద్మకు 35 వేలు మొత్తం 11, 64 , 658 వేల విలువైన CMRF చెక్కులు పంపిణి చేశారు.