*చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు, వారు అప్పగించిన క్లిష్టమైన బాధ్యత కు వన్నె తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తా : ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డా. జెడ్.శివ ప్రసాద్*
*ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ద్వారా రాష్ట్రానికి ఆర్ధికవృద్ధి తో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తా…*
*కోస్తా కారిడార్ తో పాటు పెన్నా, కృష్ణ,గోదావరి, తుంగభద్ర జల మార్గాల ద్వారా అంతర్గత రవాణా పెంపుకు కృషి చేస్తా…*
*కేంద్ర ప్రాజెక్టులను సమన్వయపరుచుకుంటూ రాష్ట్ర జల మార్గాల అభివృద్ధి కి కృషి చేస్తా…*
*- ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డా. Z. శివ ప్రసాద్*
ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన డా. జెడ్.శివ ప్రసాద్ విజయవాడలోని వారి కార్యాలయం నందు ఈ రోజు ఉదయం పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
*ఈ సందర్భంగా డాక్టర్ జెడ్ శివప్రసాద్ మాట్లాడుతూ…….*
👉 ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందిన దేశాల్లో ముందంజలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వీటి వినియోగం పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు.
👉 ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు పరిశ్రమలు రాక ఊపందుకుంటాయి. రాష్ట్రంలో పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
👉 రైలు, రోడ్డు మార్గాలకు ప్రత్యామ్నాయంగా, పర్యావరణహితంగా తక్కువ ఖర్చుతో అంతర్గతంగా జలమార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
👉 నెల్లూరు నుండి విశాఖపట్నం వరకు కోస్తా కారిడార్ 975 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటం మనకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టు ప్రకటించి ఉండడం అదనపు అంశం.
👉 పెన్నా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదుల అంతర్గత జల మార్గాలను కోస్తా కారిడార్ తో పాటు కృష్ణపట్నం పోర్టు కు అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.
👉 అంతర్గత జలమార్గాల అభివృద్ధితో రైలు, రోడ్డు మార్గాల ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించబడతాయి.
👉 జలమార్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను ప్రకటించడంతోపాటు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ఉంది. వాటిని సమన్వయపరుచుకుంటూ రాష్ట్ర జలమార్గాలను అభివృద్ధి పరచుకోవాల్సి ఉంది.
👉 విజన్ ఉన్న నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, మా మార్గదర్శి నారా లోకేష్ గారి సూచనలతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి కృషి చేస్తాను.