ఘనంగా రోషన్ స్టోర్స్ సూపర్ మార్కెట్ ప్రారంభం
.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
నెల్లూరు నగరంలోని స్థానిక సిరి గార్డెన్స్ సమీపంలో రోషన్ స్టోర్స్ సూపర్ మార్కెట్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజల కోసం వివిధ వస్తువులను ఒకచోటకు తీసుకొని వచ్చి మంచి సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారని ప్రశంసించారు . హోల్ సేల్ రేట్లకే ఎక్కడ వివిధ వస్తువులు అందుబాటులో ఉన్నాయని రోషన్ స్టోర్స్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రకాష్ మాట్లాడుతూ తమ సూపర్ మార్కెట్ ప్రారంభం సందర్భంగా 1500 కొనుగోలుపై ఒక బాక్స్ ఉచితంగా అందిస్తున్నామని 3000 కొనుగోలుపై స్టూల్ ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇవి కాకుండా ప్రతి కొనుగోలు పై లక్కీ డ్రా కూపన్స్ ఉంటాయని ప్రతి రోజు డ్రా లో గెలుపొందిన వారికి గ్యాస్ స్టవ్ ను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణ రెడ్డి, ముంగమూరు చైతన్య రెడ్డి పాల్గొన్నారు