*శివాజీ సెంటర్ మిత్రమండలి, ట్రంకు రోడ్డు, నెల్లూరులో*
*ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 496వ జయంతి వేడుకలు*
నెల్లూరు నగరంలోని స్థానిక ట్రంకు రోడ్డు శివాజీ సెంటర్ నందు చత్రపతి శివాజీ మహారాజ్ 496వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పలుమోర్చాల ఇంచార్జ్ పి సురేందర్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం ఫిబ్రవరి 19వ తేదీ భారత మాత ముద్దుబిడ్డ మరాఠాయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని తొలుత మారాట మిత్రమండలి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి మరాఠా సాంప్రదాయ పూజలు నిర్వహించారు.
పి సురేందర్ రెడ్డి గజమాలను శివాజీ విగ్రహానికి వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ పోరాటమే భారత స్వాతంత్ర సంగ్రామానికి స్ఫూర్తిదాయకమన్నారు .
విదేశీ మూష్కరులు భారతదేశాన్ని కొల్లగొడుతుంటే తల్లి జిజియా భాయ్ తుల్జాపూర్ భవాని మాత ఆశీస్సులతో వీరోచితంగా ఎదుర్కొని వారికి సింహా స్వప్నంమయ్యారు.
దేశంలో పలువురి రాజకీయ నాయకుల్లో ఇంకా విదేశీ భావజాలాలు మిగిలి ఉన్నాయనిపూర్తిగా వాటిని తుడిచిపెట్టేందుకు యువత శివాజీ మహారాజ్ ఆశయాలను, ఆదర్శాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో జరిగే ఆయన 500వ జయంతి అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి, మారాటమిత్ర మండలి అధ్యక్షులు దేవదాస్ జాదవ్ ,సందీప్ పాండురంగ, సంఘ సేవకులు ఎన్ వి సుబ్బారావు, శివాజీ సెంటర్ ప్రముఖులు కే వి సుబ్రహ్మణ్యం, పి.సత్య నాగేశ్వరరావు, బిఎస్ రంగరాజన్, మధుసూదన్, బాలసుబ్రమణ్యం, హర్షవర్ధన్, పలువురు మారాట మిత్రమండలి కుటుంబ సభ్యులు శివాజీ అభిమానులు పాల్గొన్నారు.