
**గ్రామ వేడుకలా ఆత్మీయ సమ్మేళనం – ముక్కు రాధాకృష్ణ గౌడ్**
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు
నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా వరుసగా ఎనిమిదవ సారి నిర్వహించడం జరిగింది విడవలూరు పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ హై స్కూల్ నందు 1989-90 సంవత్సరములు పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 2016వ సంవత్సరం నుండి వరుసగా ప్రతి సంవత్సరం జనవరి నెల సంక్రాంతి తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా 2025వ సంవత్సరంలో మాత్రం తమ తోటి విద్యార్థులు 5 మంది వివిధ కారణాలతో చనిపోయిన దృష్ట్యా పూర్వ విద్యార్థులంతా కలిసి వారికి సంతాప నిర్వహించుకోవడం , వారి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడం, ప్రస్తుత సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని కొనసాగించడం జరిగిందని నిర్వహణ కమిటీ తెలిపింది పై ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పూర్వ విద్యార్థి మరియు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు .ముక్కు. రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ ఒక కుటుంబం లా మారిపోయారని గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక కమిటీగా ఏర్పడి అందరి కష్టసుఖాల్లో ఒకరికొకరు చేదోడు, వాదోడుగా ఉంటూ స్నేహానికి ,విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రేమ, అభిమానాలు, అనురాగాలు కురిపిస్తూ ఐకమత్యంగా సోదర భావంతో కలసి మెలసి ఆడుతూ, పాడుతూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలతో సంవత్సరంలో ఒక రోజంతా గడపడం విందు భోజనాలు చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నారు .అలాగే సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి, జాతీయ భావాలు, నైతిక విలువలు ఆధారంగా కార్యక్రమాలు రూపొందించుకొని చిన్న, పెద్ద తేడా లేకుండా కుటుంబాలతో సహా విచ్చేసి కుల, మత, లింగ భేదాల ప్రసక్తే లేకుండా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు వరసలతో పిలుచుకుంటూ ఒక గ్రామంలో పండుగ, తిరుణాల వాతావరణం ఎలా ఉంటుందో అలా జరిగిందని కొనియాడారు. అలాగే రాబోవు రోజుల్లో కూడా ఇంకా ఉత్సాహంతో వినూత్న కార్యక్రమంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటామని చెప్పారు. అనంతరం ఆయనను శాలువాలు, పుష్పగుచ్చాలు, సీట్లతో అభినందనలతో ముంచెత్తడం జరిగింది . కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి, డి. శ్రీనివాసులు, ఎన్.సుందరయ్య, కామాక్షి, సురేష్ రెడ్డి, టి. నిరంజన్, బి.ప్రసూన, ఎన్.శశి కుమార్, రాధా, సుభాషిని, రాజేశ్వరి, ఏ.మల్లికార్జున్, రవి, ఏ.కోటయ్య, మరియు ఇతర పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.