*గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి*

– ఇందుకూరుపేట మండలంలో స్మశాన అభివృద్ధి పనుల ప్రారంభం.
– ముఖ్య అతిధులుగా పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు

విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 7 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఇందుకూరు పేట మండలం కొత్తూరు స్మశాన వాటికను ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు ప్రారంభోత్సవం చేశారు. విపిఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన గునపాటి రమేష్ రెడ్డి గారు ఇందుకూరు పేట, పోతురాజుదిబ్బ గ్రామ స్మశాన వాటికలు అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. బిజిఆర్ మైనింగ్ ఇంఫ్రాకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ 75 లక్షల రూపాయలు వెచ్చించి ఇందుకూరుపేట, పోతురాజుదిబ్బ స్మశాన వాటికలను అభివృద్ధి చేశారు. కర్మ కాండలు నిర్వహించు కునేందుకు మరియు అస్థికలు నిల్వ చేసుకునేందుకు షెల్టర్స్, సిసి రోడ్లు, ప్లాంటేషన్స్, మరియు కాంపౌండ్‌ వాల్‌ ఏర్పాటు చేసి వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా శనివారం ప్రారంభోత్సవం చేయించారు.
ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆర్ధిక స్థితి మంతులైన వారు సొంత ఊరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సొంత గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చిన గునపాటి రమేష్‌ రెడ్డి గారిని ఆయన అభినందించారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి పనికి ప్రభుత్వం పై ఆధార పడకుండా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్థులు కావాలని గ్రామస్థులను కోరారు. ఎన్నికలలో యిచ్చిన హామీని అమలు చేసే క్రమంలో ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంతో పాటు శ్మశాన వాటికలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేంద్రనాయుడు, మండల టిడిపి నాయకులు, చెంచుకిషోర్ యాదవ్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మునగాల రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *