గొంతు చించుకోకుండా.. మీరు చేసిన అక్రమాలు గుర్తు తెచ్చుకోండి – మాజీ మంత్రి కాకాణికి, ఎమ్మెల్సీకి నుడా చైర్మన్ కౌంటర్..

– మంత్రి నారాయణను విమర్శించే స్థాయి మీఇద్దరికీ లేదు..

– వైసీపీ హయాంలో చేసిన అక్రమాలను రాష్ట ప్రజలు ఇంకా మరిచిపోలేదు..

– వేల మంది టీడీపీ నేతల ప్రాణాలు తీశారు.. అస్తులను ధ్వంసం చేశారు..

– మేం విధ్వంసాలు స్టాట్ చేస్తే మీరు తట్టుకోలేరు.. కానీ మా సిద్ధాంతం అది కాదు

– ⁠మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.. రాజకీయ వేధింపులు మాకు చేతకాదు.

– వైసీపీ నేత బాలకృష్ణకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేస్తే గొంతు చించుకుని మాట్లాడుతున్నారు..

– బాలాజీనగర్ లో మూడు కోట్ల విలువైన కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్ కడితే అధికారులు సైలెంట్ గా ఉంటారా..?

కోట్ల రూపాయలు విలువ చేసే కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్ కడితే.. కోర్టు ఉత్తర్వుల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చేశారని.. అందులో ఎవరి ప్రమేయం లేదని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు.. కోర్టు ఆర్డర్ తెలుసుకోకుండా.. మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గొంతు చించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారాయణ మీద విమర్శలు చేసే స్తాయి కాకాణికి లేదన్నారు. రాక్షస పాలనకు వైసీపీ కేరాఫ్ అని.. విధ్వసం వారి సిద్దాంతమని కోటంరెడ్డి అన్నారు. కాలువ పోరంబోకు స్థలంలో వైసీపీ నేతలు ఇళ్లు కట్టడితే ప్రభుత్వం ఊరుకుంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కూల్చేస్తే..అధికారులను బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ అధికారంలోకి వస్తుందని కాకాణి పగటికలలు కంటున్నారని.. ఎద్దేవా చేశారు.

కాకాణి అరాచకాలు సర్వేపల్లి మొత్తం తెలుసు..

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చేసిన అరాచకాలు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం తెలుసని కోటంరెడ్డి వ్కాఖ్యానించారు.. బీసీనేతల రొయ్యలగుంటల విధ్వంసం చెయ్యడం, అక్రమ కేసులు పెట్టడం ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు. నీతిమంతుడు లాగా కాకాణి మాట్లాడుతూ ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితుడు ఉదయగిరి నారాయణ్ణి పోలీసులు చంపేస్తే.. అతనికి న్యాయం చేయకుండా.. పోలీసుల్ని కాపాడిన నీచ చరిత్ర కాకానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాము విధ్వంసం చెయ్యడం మొదలు పెడితే.. ఒక్కరు కూడా రోడ్డుమీద తిరగలేరని.. కానీ తాము అలా చెయ్యడం లేదని కోటంరెడ్డి వెల్లడించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డంపెట్టుకుని.. మంత్రి నారాయణతో పాటు.. ఆయన కుటుంబాన్ని వేధించలేదా అని ప్రశ్నించారు.. మంత్రి నారాయణను విమర్శించే స్తాయి చంద్రశేఖర్ రెడ్డికి లేదని కోటంరెడ్డి వ్యాఖ్యనించారు.పై కార్యక్రమంలొ నగర అదేక్షులు మామిడాల మధు, ఉచ్చిభూవానేవార్ ప్రసాద్,కువ్వారపు బాలాజీ,అంచురి శ్రీనివాసులు నాయుడు, జహీర్, కోకు మహేంద్ర రెడ్డి, ఆకుల హనుమంత్ రావ్, తంబీ సుజన్ కుమార్,పెనుబర్తి సాయి,పిరిగల నవీన్, రామ్,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *