గురుగోవింద్ సింగ్ కుమారులకు నివాళిగా డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’

జోరావర్ సింగ్, ఫతే సింగ్‌ల కు ఘన నివాళి

నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ లో ఉన్న సత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు YK ఆచారి స్కూళ్లలో వీర బాలల దివాస్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సావర్కర్ విచ్చేశారు ,పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ వీర్ బల్ దివాస్, డిసెంబర్ 26న జరుపుకుంటారనీ ఇది వీరత్వం మరియు త్యాగం యొక్క స్ఫూర్తితో నిండిన రోజు అని ఇది 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జీ యొక్క చిన్న కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్ మరియు సాహిబ్జాదా ఫతే సింగ్ యొక్క బలిదానం జ్ఞాపకార్థం. అని 9 మరియు 7 సంవత్సరాల వయస్సు గల ఈ యువ రాకుమారులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించినందుకు సజీవంగా చంపబడ్డారన్నారు. భారత ప్రభుత్వం , ప్రత్యేకంగా ప్రధానమంత్రి, యువ సాహిబ్జాదాస్, జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు మరియు త్యాగాలను గౌరవించేందుకు వీర్ బల్ దివస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ డిసెంబర్ 26న జాతీయ దినోత్సవంగా ప్రకటించారనీ, వారి అసాధారణ ధైర్యాన్ని స్మరించుకుందమని వారి స్ఫూర్తిదాయకమైన కథను భవిష్యత్తు తరాలలో వారి మనసుల్లో సజీవంగా ఉంటుందని అన్నారు.సమాజంపై వీర్ బల్ దివాస్ ప్రభావం చాలా లోతైనదినీ మరియు విస్తృతమైనది అని ఇది దేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వం ,గౌరవాన్ని కలిగిస్తుంది అన్నారు .ముఖ్యంగా యువ తరానికి ధైర్యసాహసాలు, విశ్వాసాల కోసం దృఢంగా నిలబడటం వంటి విలువలను నేర్పిస్తూ స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి , మండల అధ్యక్షులు జివిటి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి మింగా కిరణ్ కుమార్,జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ బీజేవైఎం అధ్యక్షులు అశోక్ నాయుడు మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంటా విజయ శ్రీ మారం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed