*గిరిజన కాలనీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించండి*

– సేవకు మారుపేరు సింహపురి వైద్య సేవా సమితి.
– ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వీడండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో జయభారత్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరియు ఒత్తిడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా వుండాలని కోరారు. సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో జయభారత్ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కొనియాడారు. మెడికల్ క్యాంప్ ద్వారా కిడ్నీ, కళ్ళు, కీళ్ళు, ఎముకల వ్యాధులకు ఉచితంగా వైద్యం సేవలు అందిస్తున్న జయభారత్ వైద్య సిబ్బందిని ఆమె అభినందిస్తున్నాను. మారుమూల ఎస్సి, ఎస్టీ, కాలనీలకు జయభారత్ వైద్య సేవలు విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు. అవసరమైతే టిడిపి స్థానిక నాయకుల సేవలు వినియోగించుకోవాలని సింహపురి వైద్య సేవా సమితి పెద్దలకు సూచించారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక నాయకుల కీలకమన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు మాట్లాడుతూ చికిత్స కన్నా వ్యాధి నిర్ధారణ ముఖ్యమన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి ట్రస్టి డాక్టర్ ఎ వి సుబ్రహ్మణ్యం, జివి కృష్ణారెడ్డి, హరికుమార్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, ముంగమూరు చైతన్య రెడ్డి మరియు జయభారత్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed