
*SPS నెల్లూరు జిల్లా*
*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు యొక్క రిహార్సల్స్ పరిశీలించిన జిల్లా యస్.పి. డా, అజిత వేజెండ్ల,IPS.,*
రానున్న 26వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించనున్న కవాతు కార్యక్రమానికి సంబంధించి, జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న రిహార్సల్స్‌ను జిల్లా యస్.పి. గారు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ కవాతును పరిశీలించి, పరేడ్ క్రమబద్ధంగా, శ్రద్ధతో సాగుతోందని అభినందిస్తూ, ఇదే స్పూర్తితో గణతంత్ర దినోత్సవ రోజు మరింత ఉత్సాహం, క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు.
జెండా వందన కార్యక్రమానికి విచ్చేసే ముఖ్య అతిథి, ఇతర అతిథులకు గౌరవ వందనం సమర్పించే విషయంలో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
గణతంత్ర వేడుకల సమయంలో భద్రత అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరినీ DFMD (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్) ద్వారా తనిఖీ చేసిన అనంతరమే కార్యక్రమ ప్రాంగణంలోకి అనుమతించాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లతో భద్రతా పరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జెండా వందన కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించాలన్నారు. కూర్చునే ఏర్పాట్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, తాగునీరు తదితర సౌకర్యాలపై పలు సూచనలు చేశారు.
గణతంత్ర వేడుకల ప్రారంభ కార్యక్రమం నుండి ముగింపు వరకు జరిగే అన్ని అంశాలను జిల్లా యస్.పి. గారు సమగ్రంగా పరిశీలించారు మరియు అవసరమైన మార్పులు, మెరుగుదలలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
వాహనాల పార్కింగ్ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు మరియు ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
చివరగా, గణతంత్ర దినోత్సవ వేడుకలు గౌరవప్రదంగా, భద్రతతో, సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా యస్.పి. గారు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష,IPS., గారు, DSP (AR) శ్రీ చంద్రమోహన్ గారు, రూరల్ DSP శ్రీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారు, RI అడ్మిన్ శ్రీ హరిబాబు, RI వెల్ఫేర్ శ్రీ రాజారావు, SB-1 CI శ్రీ వెంకటేశ్వరరావు, SB-2 CI శ్రీ శ్రీనివాస రెడ్డి గార్లు, RSI లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.24.01.2026.