
*గడిచిన మూడు రోజులలో లోక్ అదాలత్ ద్వారా నోటీసులు అందుకున్న బకాయిదారుల నుంచి 4.50 కోట్లు నగర పాలక సంస్థ ఖజానాకు జమ అయినదని, మొత్తం కలిపి 5.13 కోట్లు వసూళ్లు జరిగాయి : కమిషనర్ వై.ఓ నందన్*
జిల్లా జడ్జిల ఆధ్వర్యంలో శనివారం నాడు జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమము ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు వరకు జరిగినది.
ఇందులో లోక్ అదాలత్ నోటీసులు అందుకున్న బకాయి దారులు 500 మంది హాజరయ్యారు.
నోటీసులు అందుకున్న వారు లోక్ అదాలత్ ద్వారా చెల్లించిన మొత్తము ఇంటి పన్ను 27 లక్షలు, కొళాయి పన్ను 32.59 లక్షలు, ఖాళీ స్థలం పన్ను 1.00 లక్ష, ట్రేడ్ లైసెన్సులు 4.50 లక్షలు చెల్లించారు.
అలాగే గడిచిన మూడు రోజులలో లోక్ అదాలత్ ద్వారా నోటీసులు అందుకున్న బకాయిదారుల నుంచి 4.50 కోట్లు నగర పాలక సంస్థ ఖజానాకు జమ అయినదని, మొత్తం కలిపి 5.13 కోట్లు వసూళ్లు జరిగాయని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు అందుకొని ఇంకను బకాయిలు చెల్లించని వారిపై కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లలో విశేషంగా కృషి చేసిన ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ శేషగిరిరావును ఈ సందర్భంగా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.