*గంగపట్టణాన్ని దార్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా*

– భక్తులకు సౌకర్యాలు కల్పించండి.
– అమ్మవారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం సుభిక్షంగా వర్ధిల్లాలి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహా కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గంగపట్నం విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఆలయ అర్చకులు పూర్ణకుభంతో ఘన స్వాగతం పలికారు. చామందేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ
చాముండేశ్వరి అమ్మవారి మహా కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. శక్తిశ్వరూపిణి అయిన అమ్మవారిని సేవించడం వల్ల మానసిక వ్యాధులు, గ్రహదోషాలు, రోగాలు తొలగిపోతాయన్నారు. గంగపట్నాన్ని ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. శక్తిస్వరూపిణిగా ప్రసిద్ధి చెందిన చామండేశ్వరి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారి మహా కుంభాభిషేకం సందర్బంగా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ద చూపాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, బొద్దుకూరు సుధీర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed