*“క్రీడల్లో విజయం కోసం క్రమశిక్షణ, కృషి ముఖ్యం” – వి.ఎస్.యూ వైస్ ఛాన్స్లర్…*
…………..
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ) హ్యాండ్ బాల్ పురుషుల జట్టు ఈ నెల 28న పెరియార్ యూనివర్సిటీ సేలంలో జరుగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు జట్టు సభ్యులకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, కఠిన శ్రమ, సమష్టి ప్రదర్శన ఎంతో అవసరం. విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించి విశ్వవిద్యాలయ గౌరవాన్ని మరింత పెంచాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.
అలాగే, విశ్వవిద్యాలయం తరఫున క్రీడాకారులకు అన్ని రకాల సహాయసహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ కే సునీత స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ వెంకట్రాయలు, విశ్వవిద్యాలయ పీడీలు డాక్టర్ ఏ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఏ రామయ్య, స్పోర్ట్స్ బోర్డ్ సిబ్బంది ఏ అజయ్ కుమార్, నారాయణ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.