క్యాన్సర్ పేషెంట్ కు మంత్రి నారాయణ ఆర్థిక చేయూత
*సొంత నిధులతో వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని నారాయణ హామీ*
*టిడిపి మహిళా నాయకురాలు మంగమ్మను పరామర్శించిన మంత్రి నారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్*
మంగమ్మ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి భరోసా
కన్నీటి పర్యంతమైన మంగమ్మకు ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ
*సొంత నిధులతో వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని నారాయణ హామీ*
————నెల్లూరు సిటీ
నెల్లూరు నగర పరిధిలోని
తొమ్మిదో డివిజన్ కుసుమ హరిజనవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళ నాయకురాలు సిహెచ్ మంగమ్మ ఇటీవల క్యాన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురి కావడంతో చలించి పోయిన *రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్* తో కలిసి సోమవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు
టిడిపి సీనియర్ నాయకురాలు మంగమ్మ అనారోగ్యానికి గురి కావడం బాధ కలిగించిందని మంత్రి పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు
*మంగమ్మ కుటుంబ సభ్యులకు మంత్రి నారాయణ చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందించారు*
గత ఎన్నికల్లో తన గెలుపు కోసం మంగమ్మ ఎంత కష్టపడి పని చేశారని ఈ సందర్భంగా మంత్రి నారాయణ గుర్తు చేసుకున్నారు
కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, మంగమ్మ వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు.