*కౌలు రైతుల వి ఆదాయం లేని బ్రతుకులు*
*ఎకరానికి మూడు వేల రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని నెల్లూరు పౌర సరఫరాల సంస్థ ఏడీఎంకు విజ్ఞప్తి : బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*

… నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగం.50 శాతం కు పైగా కౌలు రైతులు మీదే ఆధారపడి ఉంది.
ఒక ఎకరాకు సుమారు 20000 భూమి హక్కుదారుడికి చెల్లించాలి
ఈ సీజన్లో వ్యవసాయ ఖర్చులు పెరిగి ఎకరాకు 35000 రూపాయలు పెట్టుబడి పెట్టారు.
సీజన్ లో వచ్చిన మార్పులు మబ్బులు వాతావరణం వర్షపు చినుకులు రైతులకు కలిసి రాలేదు. *పంటల దిగుబడి తగ్గింది*.
జిల్లాలో 50 శాతం బి పి టి రకాన్ని రైతులు పండించారు. బీపీటీకి తగిన ధర లభించలేదు. ఈ వ్యవసాయ సీజన్లో కౌలు రైతులకు ఆదాయం లేకుండా వ్యవసాయ సాగు జరిగింది.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రులుగా ఉన్నప్పుడు రైతులు నష్టపోతున్నప్పుడు పుట్టి కి500 రూపాయలు బోనస్ ప్రకటించి ఆదుకున్నారు.
ఈ సీజన్లో 36 వేల మంది కౌలు రైతులు నష్టపోయి వ్యవసాయం చేశారు. వారికి ఆర్థిక ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు

నెల్లూరు జిల్లాలో వాగులు పోరంబోకులు ప్రభుత్వ భూములలో లక్ష ఎకరాలలో వరి సాగు చేశారు. వీళ్లను వ్యవసాయ శాఖ గుర్తించలేదు. వీరు మద్దతు ధర లేకుండానే ధాన్యాన్ని విక్రయించుకున్నారు.

అనాధీన భూములలో వరి సాగు చేసిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి. ఓ.సుధాకర్. అల్లి రవి కుమార్ యాదవ్. పల్నాటి సూర్యనారాయణ.పి ఆదినారాయణ. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed