*కో-ఆపరేటివ్ బ్యాంక్ 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సహకార వ్యవస్థకే గర్వకారణం : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

– 645 మంది సభ్యులతో 4 వేల రూపాయల షేర్ క్యాపిటల్ తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి 65 కోట్ల 32 లక్షల టర్నోవర్ తో మహావృక్షంలా ఎదిగింది.
– ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటికి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ యర్రంరెడ్డి బాల కృష్ణా రెడ్డి, స్వర్గీయ గునపాటి సుబ్బరామిరెడ్డి గార్లకు ఘన నివాళులు.
– 50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో రైతులకు సేవలందించిన అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు బ్యాంకు సిబ్బందికి అభినందనలు.
– మరో వందేళ్ల పాటు ఈ సొసైటీ రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలి.
– విపిఆర్ ఫౌండేషన్ ద్వారా టెంకాయ, మామిడి రైతుల కోసం పవర్ స్ప్రేయర్ ఏర్పాటు.
– ఇందుకూరు పేట కో ఆపరేటివ్ బ్యాంక్ స్వర్ణోత్సవ సభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటికి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ యర్రంరెడ్డి బాల కృష్ణా రెడ్డి, స్వర్గీయ గునపాటి సుబ్బరామిరెడ్డి గార్లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు. ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాలలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సొసైటీ కార్యవర్గం మరియు సభ్యులైన రైతులకు శుభాకాంక్షలు తెలియచేసారు. 1956 లో బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో కీర్తిశేషులు శ్రీ యర్రంరెడ్డి బాల కృష్ణా రెడ్డి గారు సహకార వ్యవస్థ పై రైతులకు అవగాహన కల్పించి ఈ సొసైటీకి బీజం నాటారన్నారు. నాడు 645 మంది సభ్యులతో 45 వేల రూపాయల షేర్ క్యాపిటల్ తో చిన్న మొక్కగా ప్రారంభమై ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి 65 కోట్ల 32 లక్షల టర్నోవర్ తో వేలాది మంది రైతులకు నీడ కల్పించడం సహకార వ్యవస్థకు గర్వకారణమన్నారు.

వర్షాలు పడక పంట పండకపోయినా తుఫానులొచ్చి నోటికాడి పంటా నీళ్ల పాలైన అప్పులు తీర్చలేక రైతు గుండె భారమైనప్పుడు ఇందుకూరు పేట కో ఆపరేటివ్ బ్యాంక్ .. ‘నేనున్నాను’ అని రైతుల భుజం తట్టిందన్నారు.పిల్లల పెళ్లిళ్లు వారి చదువులకు ఇందుకూరు పేట కో ఆపరేటివ్ బ్యాంక్ రైతులకు అండగా నిలిచిందన్నారు. 50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటి అభివృద్ధిలో భాగస్వాములై రైతులకు సేవలందించిన అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు బ్యాంకు సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు

2024-25 సంవత్సరంలో సభ్యులకు 27 కోట్ల 67 లక్షలు రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా రైతులకు ఎరువులు, పురుగు మందులు అతి తక్కువ మార్జిన్ తో రొయ్యల, చేపల రైతులకు ఫీడ్ అందిస్తూ తెలిసింది దాదాపు 70 లక్షలు ఆదాయాన్ని ఆర్జించిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు బ్యాంక్ సేవలను కొనియాడారు.

రైతుల సౌకర్యార్ధం మైపాడు మరియు జగదేవపేట బ్రాంచీలతో పాటు 700 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములు నిర్వహిస్తూ సహకార బ్యాంకులకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఇందుకూరు పేట సొసైటి. రైతులకు అండగా నిలుస్తున్న ఇందుకూరుపేట కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ 50 ఏళ్ల ప్రయాణం కేవలం ఆరంభం మాత్రమే.. మరో వందేళ్ల పాటు ఈ కోఆపరేటివ్ సొసైటీ ఇలాగే రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షులు గండవరపు అమర్ నాధ్ రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ అధికారులు కాటసాని తిరుపాల్ రెడ్డి, బి రవికుమార్, డైరెక్టర్లు పెనుబల్లి కృష్ణ చైతన్య, సుద్దలగుంట ప్రమీల, రాష్ట MSME డైరెక్టర్ రావెళ్ల వీరేంద్ర నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టిడిపి సినియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, పిఎల్ రావు లతో పాటు స్థానిక టిడిపి ,బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed