*కోవూరు నియోజకవర్గాన్ని టిడ్కో పరిధిలో చేర్చండి*
– పేదలకు పక్కా గృహాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
సెమి అర్బన్ ప్రాంతమైన కోవూరు నియోజకవర్గాన్ని టిడ్కో పరిధిలో చేర్చాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. శుక్రవారం ఆమె శాసనసభలో ప్రభుత్వ పక్కా గృహాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గ పరిధిలో 8,660 మంది పక్కా గృహాల కోసం దరఖాస్తు చేశారని కోవూరు మండలం పడుగుపాడు, విడవలూరు మండలం చౌకిచర్ల, కొడవలూరు మండలం చంద్రశేఖర పురంతో పాటు బుచ్చి పట్టణ పరిధిలో వున్న ప్రభుత్వ భూములలో పేదలకు పక్కా గృహాలు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న ఉపసభాపతి రఘురామరాజు రఘురామరాజు గారు ఈ ప్రశ్న మున్సిపల్ శాఖా పరిధిలో రాదన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం నుడా పరిధిలో వున్న విషయాన్ని దృష్టిలో వుంచుకొని టిడ్కో పరిధిలో చేర్చాలని ఉపసభాపతి ద్వారా ఆమె మంత్రి నారాయణ గారికి విజ్ఞప్తి చేశారు.