*కోట్లాదిమంది జనహృదయాలలో ఈనాటికీ జీవిస్తున్నారు ఎన్టీఆర్*
*ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా తదితర ఖండాల్లో ఏడాదిపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు*
*ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగుదనానికి చిరునామాగా నిలిచారు*
*వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్ ) గారి 101వ జయంతి వేడుకలను మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు మావిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, టీడీపీ మండల ఉపాధ్యక్షులు చల్లా నాగార్జున్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వలిపి మునుస్వామి, అనుబంధ సంఘాల నాయకులు*
*ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడంతోపాటు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు మావిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, టీడీపీ మండల ఉపాధ్యక్షులు చల్లా నాగార్జున్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వలిపి మునుస్వామి, అనుబంధ సంఘాల నాయకులు*
*గుమ్మడి రాజా యాదవ్ — స్క్రోలింగ్ పాయింట్స్ :-*
సామాజిక వ్యవస్థ కోసం రాజకీయ వ్యవస్థ ఉండాలే కానీ.. రాజకీయ వ్యవస్థ కోసం సామాజిక వ్యవస్థ ఉండకూడదన్నది ఎన్టీఆర్ ప్రగాఢ విశ్వాసం
ఎన్టీఆర్ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి రాజకీయ వ్యవస్థ మార్గదర్శకంగా ఉండాలనేవారు
అభివృద్ధి, సంక్షేమం, సేవా రంగాలను సమదృష్టితో చూసేవారు
రాయలసీమ దుర్భిక్షం, చైనా దురాక్రమణ జరిగిన సమయంలో అమరజీవుల కుటుంబాలను ఆదుకోవడం కోసం, దివిసీమ ఉప్పెన సందర్భంలోనూ జోలె పట్టి, ఊరూరా తిరిగి నిధులు సేకరించి బాధితులను ఆదుకున్నారు
ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించి లక్షలాదిమంది క్యాన్సర్ రోగులకు సేవలందించారు
ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో ఈ తరహాలో నటించిన నటులు మరొకరు కనిపించరు
పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి, భగవంతుని రూపాలను సజీవంగా తెలుగు ప్రజల మనసులలో నిలిచిపోయేలా చేశారు
ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన వాడే నిజమైన నాయకుడు, అలా ఉద్భవించిన వాడే ఎన్టీఆర్
కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ను ప్రతి ఒక్కరూ ఆరాధించారు
ప్రత్యర్థి పార్టీలు సైతం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహిస్తుంటాయి
ప్రజా శ్రేయస్సును శిరస్సున దాల్చి జాతి హితం కోరి ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేశారు
నాలుగు దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చేయాలని నిత్యం ఎన్టీఆర్ తప్పించేవారు
నూరు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో 9 నెలల్లో కుకటి వేళ్లతో పెకలించి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు
రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది యువతకు, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్
ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసే నాటికి రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత, స్తబ్దత, అస్థిరత్వం నెలకొని ఉన్నాయి
జాతీయ స్థాయిలో ప్రాంతీయ పాత్రను ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు
పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది
గవర్నర్ల వ్యవస్థపై, రాష్ట్రాల హక్కులపై రాజీలేని పోరాటం చేసి దేశ రాజకీయాలను ఎన్టీఆర్ మలుపు తిప్పారు
సంక్షేమానికి ఎన్టీఆరే ఆధ్యుడు, పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడంతోపాటు సామాజిక న్యాయం చేయాలన్నదే ఆయన ప్రధాన ఆశయం
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదించారు
9 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు
రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు, జనత వస్త్రాల పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు
స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 9 శాతం, బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది
రూ.50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, వృద్ధాప్య పెన్షన్, తెలుగుగంగ వంటి అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు
అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి మండలి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు
పటేల్, పట్వారి వ్యవస్థలను విప్లవత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారు
ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశ్వరూపంలో తెలుగు ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు
తెలుగుజాతి ఔన్నత్వానికి, ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక, ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి అమరుడైన ఎన్టీఆర్ కు అందరూ ఘన నివాళులర్పించాలి