
*”కోటి సంతకాల సేకరణ విజయవంతం” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా*
*తేది:09.12.2025*
*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, నెల్లూరు రూరల్ ఇంచార్జీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి వర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా||కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*మాజీ మంత్రి కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్:*…
– మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా లోని అన్ని నియోజక వర్గాల్లో కందుకూరు నియోజకవర్గంతో సహ (11 నియోజకవర్గాలలో) మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో మహా యజ్ఞంలా సాగింది.
– ఈ కార్యక్రమాన్ని విజయ వంతంగా పూర్తి చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ అనుబంధ సంఘాలు,విద్యార్ధుల తల్లితండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావేత్తలకు అందరికీ కృతజ్ఞతలు..
– సేకరించిన కోటి సంతకాలను డిసెంబర్ 10వ తేదీ నియోజవర్గ కేంద్రాల నుండి ఊరేగింపుగా వైయస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి చేరుస్తాం.
– డిసెంబర్ 15వ తేదీన, 11 నియోజకవర్గాలకు సంబంధించి కోటి సంతకాలకు సంబంధించిన ప్రతులను గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించి, డా||బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ముగింపు సభ నిర్వహించడం జరుగుతుంది.
– డిసెంబర్ 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సేకరించిన కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్ గారికి అందించి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతాం.
– కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబుకు, కూటమి నేతలకు కడుపు మండిపోతుంది.
– ఇండిగో వ్యవహారంలో వార్ రూం నిర్వహించామని చెప్పుకొని తెలుగుదేశం నవ్వులు పాలైంది..
– కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాతో కలిపి నడిచారు.
– కరుడు గట్టిన టిడిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కోటి సంతకాలు సేకరణకు కొందరు నేరుగా, మరికొందరు పరోక్షంగా సంతకాలు పెట్టి మద్దతు తెలిపారు..
– కోటి సంతకాలు సేకరణ కార్యక్రమానికి మద్దతు తెలిపి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
*ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్:*
– మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
– 50 రోజులుగా విజయవంతంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాల సేకరణ అనుకున్న దానికంటే ఎక్కువగా సేకరించాం.
– రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుండి 60 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలు సేకరించాం.
– కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అన్ని పార్టీలు ముందుకు వచ్చి సంతకాలు చేసి, విజయవంతం చేయడం హర్షణీయం.
– కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం కావడం చంద్రబాబు ప్రజావ్యతిరేక నిర్ణయాలకు చెంపపట్టు లాంటిది.
– నెల్లూరు నగర నియోజవర్గంలో డిసెంబర్ 10వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని, విజయవంతం చేయాలని కోరుతున్నాం.
*మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్క్రోలింగ్ పాయింట్స్:*
– పేదవారికి వైద్య విద్య అందించాలనే ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకున్నారు..
– రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను స్థాపిస్తే, వైద్య విద్యతో పాటు, పేద వారికి వైద్యం కూడా అందుతుంది.
– ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పప్పు, బెల్లంకు అమ్మేయాలని చూస్తుంది.
– మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంకు ప్రజల నుండి స్పందన వచ్చింది.
– ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలి అని కోరుతున్నారు..
– నియోజవర్గంలో చేసిన సంతకాల సేకరణ జిల్లా కేంద్రంకు తీసుకు వచ్చి ఈ నెల 15 న ర్యాలీ చేపడుతాం.
– ప్రజలు వ్యతిరేకిస్తున్నా, చంద్రబాబుకు చలనం కూడా లేకుండా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాడు.
– కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు..
*నెల్లూరు రూరల్ ఇంచార్జీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్:*
– మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరంకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతమైంది..
– రేపు రూరల్ నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను ఊరేగింపుగా తీసుకొనివచ్చి, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అందిస్తాం..
– మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఆపాలని మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు..
– రూరల్ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు..