*కోటంరెడ్డి సోదరులు చూపిన ఆప్యాయత, నెల్లూరు రూరల్ ప్రజలు పలికిన అపూర్వ స్వాగతం మరువలేను.* *కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఏబీవీపీ, యూత్ కాంగ్రెస్ లో పని చేస్తున్న సమయం నాటికే మా మధ్య స్నేహ బంధం ఉంది.* *కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినేందుకు గిరిధర్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం అభినందనీయం.* *-బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

*కోటంరెడ్డి సోదరులు చూపిన ఆప్యాయత, నెల్లూరు రూరల్ ప్రజలు పలికిన అపూర్వ స్వాగతం మరువలేను.*

*కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఏబీవీపీ, యూత్ కాంగ్రెస్ లో పని చేస్తున్న సమయం నాటికే మా మధ్య స్నేహ బంధం ఉంది.*

*కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినేందుకు గిరిధర్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం అభినందనీయం.*

*-బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర రెండవసారి శాసనమండలి సభ్యులు గా నియమితులైన సందర్బంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి సోదరుల నేతృత్వంలో అశ్వాల రథం తో పాటు భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు.

మాగుంట లే అవుట్ లోని బీద నివాసం వద్ద మొదలైన ర్యాలీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కార్యాలయం వరకు సాగింది. అనంతరం టిడిపి నెల్లూరు రూరల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో బీద కు ఘన సన్మానం నిర్వహించారు.

*ఈ సందర్బంగా బీద మాట్లాడుతూ……*

పాత ,కొత్త టిడిపి శ్రేణులను కలుపుకొని రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని సమన్వయం లో మొదటి స్థానం కి చేర్చిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది.

బీసీ భవన్, అంబేద్కర్ భవన్, జగ్జీవన్ భవన్ లు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కేటాయించబడి ఉండటం శుభ పరిణామం.

ఇప్పటికే బీసీ భవన్ కి 5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. మంత్రి నారాయణ గారు మరో కోటి రూపాయలను బీసీ భవన్ కు విరాళం గా ఇచ్చారు.

105 శంఖుస్థాపన లతో రాష్ట్ర ప్రజల దృష్టిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకర్షించారు. అభివృద్ధి కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించడం అభినందనీయం.

అందుబాటులో ఉన్న నిధులు, వనరులతో వీలైనంత ఎక్కువ అభివృద్ధి చేసేందుకు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తపన పడుతున్నారు.

నియోజకవర్గం లో పాదయాత్ర, అభివృద్ధి పనులను చేపట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు.

వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన షేక్ అబ్దుల్ అజీజ్ ను రాష్ట్రంలోనే తొలిగా సన్మానించి ఇది తన బాధ్యత అని చెప్పిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

మంత్రి ఎండి ఫారుఖ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ లను సమన్వయం చేసుకుని బారా షాహిద్ దర్గా అభివృద్ధి కి నిధులు మంజూరు చేయించాలని శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని కోరుకుంటున్నాను.

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కీలక ప్రాజెక్ట్ అయిన పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణానికి ఆర్ అండ్ బి శాఖామాత్యుల తో మాట్లాడి నిధుల విడుదల కు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed