నీటిపారుదల రంగానికి మొదటి ప్రాధాన్యతనివ్వండి. . *కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కకు మళ్లించడం వలన ప్రాజెక్టులు ప్రమాద స్థితికి* చేరుతున్నాయి.
నిధులు కేటాయించి ఇరిగేషన్ వ్యవస్థను ఆధునికరించాలని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ నెల్లూరు జల వనరుల శాఖ సెంట్రల్ డివిజన్ డి ఈ అనిల్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు జిల్లాలో మొదటి పంటకు నీరందించేందుకు 50 కోట్లు .ఓ & ఎం పనులకు 5 కోట్లు. సంఘం నెల్లూరు బ్యారేజీలకు 45 కోట్లు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది
కేంద్ర నిధులు.. డ్రవ్ట్ మెయింటెనెన్స్ ఫండ్ 12 కోట్లు. జిల్లాలో చేసిన పనులకు నిధులు చెల్లించాల్సి ఉంది.

సోమశిల లో దెబ్బ తిన్న ఆఫ్రాన్ పనులకు 13 కోట్లు.
సోమశిల హై లెవెల్ కెనాల్ పనులకు 195 కోట్లు . ఎస్ఎస్ కెనాల్కు 30 కోట్లు బకాయిల చెల్లింపు లు పెండింగ్లో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు *డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్* క్రింద 284 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో ఒక్క రూపాయి కూడా ఇరిగేషన్ కోసం ఉపయోగించలేదు. అలాగే కేంద్రం విడుదల చేసిన *డ్రోవ్ట్ మానిటరింగ్ ఫండ్* ద్వారా చేసిన పనులు 12 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది
ప్రమాద స్థితిలో ఉన్న శ్రీశైలం జలాశయానికి 2009 సంవత్సరం నుండి నిధులు కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత 15 సంవత్సరాలుగా శ్రీశైలం ఫ్లంజ్ పూల్ పూడిక పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.
*ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్* ద్వారా బిందు సేద్యం చేసే పనిలో కూడా నెల్లూరు జిల్లాకు కోటి 50 లక్షలు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం జలాశయం కోసం *డివిడెంట్ రీఇన్వెస్టర్ ప్రాజెక్టు* క్రింద పోయింది 1072 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలు జల వనరుల వరకు నిధులు విడుదల చేయకపోయినా *కేంద్రం ఇచ్చిన నిధులను గత10 సంవత్సరాలుగా పక్కదారిపట్టించాయి*.
జనజీవన వ్యవస్థకు. వ్యవసాయ రంగానికి. పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి ఇరిగేషన్ ను విస్మరించడం ప్రమాదకరం.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కంటే జల వనరుల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రమేష్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పొట్లూరు అయినకోట కావటి శిరీష. ప్రభాకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed