*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ*
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి తండ్రి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ గారు ఇటీవల కన్నుమూశారు.
ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రం తల్చేరులోని కేంద్రమంత్రి ఇంటికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈ సందర్భంగా ఆయన్ను పరామర్శించారు.
దేబేంద్ర ప్రధాన్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎంపీ వేమిరెడ్డితో ఎంపీలు సీఎం రమేష్, పురందేశ్వరి గార్లు తదితరులు ఉన్నారు.