*కృష్ణా జలాలలో సోమశిల కండలేరు డ్యామ్ ల నీటి వాటాల సంగతి తేల్చాలి*.

*సముద్రంలో కలిసే గోదావరి జలాలుతో ఆంధ్ర చేపట్టే సర్కార్ చేపట్టే నల్లమల సాగర్ ప్రాజెక్టును తెలంగాణ దుర్మార్గంగా వ్యతిరేకిస్తోంది*…
బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్..

సోమశిల కండలేరులకు *హక్కుగా రావలసిన నీటిని రాబట్టాలని* సోమశిల ఎస్ ఈ రమణారెడ్డికి బిజెపి నేత రమేష్ విజ్ఞప్తి చేశారు.

అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం చెన్నైకి నీరు ఇచ్చేందుకు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ 12 టీఎంసీల కృష్ణా జలాలు కండలేరు డ్యామ్ కి ఇప్పటివరకు ఇవ్వనే లేదు…

గత 30 సంవత్సరాలుగా ఒక్క టీఎంసీ నీటిని కూడా కండలేరుకి ఇవ్వలేదు..
వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోయి సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రకు నీలిచినట్టుగా చూపడం మానవ సమాజాన్ని అవమాన పరచడమే అవుతుంది.

చెన్నైకు నీరు విడుదల చేయాలన్న సోమశిల లో 17 టీఎంసీలు కనీసం నిల్వ ఉంటేనే సాధ్యమవుతుంది.
కండలేరు నుండి చెన్నైకి నీరు విడుదల చేయాలంటే 8.5 టీఎంసీల నీరు ఉంటేనే సాధ్యపడుతుంది.
చెన్నైకు ఇవ్వవలసిన 15 టిఎంసిలు వాస్తవానికి ఏ రాష్ట్రాలు ఇవ్వలేదు. సోమశిల కండలేరులలో తప్పనిసరిగా 25 టిఎంసిలు అంతర్ రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగా కృష్ణా జలాలు నిల్వచేయాలి..
40 టీఎంసీలు కృష్ణా జలాలపై సోమశిల కండలేరు డ్యాములు హక్కులు కలిగి ఉన్నాయి.
ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపు అప్పర్ బద్ర లిఫ్ట్ ఇరిగేషన్ లు పూర్తి అయితే తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడుతుంది..
తెలంగాణలో నీటి కోసం ఓట్ బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ బి ఆర్ఎస్ లు చేస్తున్నాయి.

సముద్రంలో కలిసే నీటి మల్లింపుతో నల్లమల సాగర్ నిర్మిస్తామంటే ఆంధ్రను తెలంగాణ కాంగ్రెస్ విఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి..

నిజంగా తెలంగాణ వాదులకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక ప్రాజెక్టుల వలన 300 టిఎంసిలు కృష్ణా జలాల కొరత పై పోరాడాలని రమేష్ డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి. నారాయణ యాదవ్. నీలి శెట్టి లక్ష్మణరావు. బుధవరపు బాలాజీ. టి శ్రీనివాసులు చింతగింజల సుబ్రమణ్యం ప్రశాంత్ ధనుంజయ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed