.
కూటమి ప్రభుత్వ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు మొండి చేయి మిగిల్చారు.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
*గుంటూరు శాసనమండలి ఆవరణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులతో కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు* ..
*చంద్రశేఖర్ రెడ్డి* గారి కామెంట్స్.
*గత ఏడాది ఎన్నికల సందర్బంగా ఉద్యోగులు, నిరుద్యోగులను కూటమి పార్టీలు హామీలతో ఆకట్టుకున్నారు*
.
*2019లో జగన్ గారు మొదటి కాబినెట్ లోనే ఉద్యోగులకు 29 శాతం ఐఆర్ ప్రకటించారు. 23 శాతం పీఆర్సీని ఇచ్చారు.*
కూటమి ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తామని, పీఆర్సీని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.
*ఈ బడ్జెట్ లో ఐఆర్ ప్రకటిస్తారు, పీఆర్సీ కోసం కమిటీ వేస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఎక్కడ దానిపై ప్రస్తావన లేదు.*
*నిరుద్యోగులకు సంబంధించి మెగా డీఎస్సీ అని ప్రకటించి, ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొత్త ఉద్యోగాల గురించి ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై కేటాయింపులు లేవు.*
*విద్యార్ధులకు గత ఏడాదికి సంబంధించి మూడు క్వార్టర్ల బకాయిలను కూడా చెల్లించలేదు. ఇప్పటి వరకు ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో పెట్టారు. పరీక్షలు పూర్తవుతున్న నేపథ్యంలో బకాయిలు ఉన్నాయంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.*
*రాష్ట్రం అప్పుల పాలయ్యిందని గత ప్రభుత్వంపై నిందలు వేశారు. ఈ రోజు బడ్జెట్ లో జగన్ గారు 2023-24 లో కేవలం రూ.79 వేల కోట్లు మాత్రమే అప్పులు తీసుకువచ్చారని రాశారు. అన్ని పథకాలు అమలు చేసిన తరువాత కూడా చేసిన అప్పులు ఇవి.*
*కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు గానూ ఏ పథకాన్ని అమలు చేయకుండానే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.04 లక్షల కోట్లు అప్పులు చేస్తామని, గత ఏడాది రూ.98,576 కోట్లు అప్పులు చేశామని బడ్జెట్ లో ప్రకటించారు. బడ్జెట్ లోని డొల్లతనంపై సభలో నిలదీస్తాం.*
– 3వ తేదీన వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు బయటపెడతాం
*రాష్ట్రంలో వీసీల రాజీనామాలపై మంత్రి నారా లోకేష్ కు ఆధారాలు ఇస్తామని చెప్పాం. పంతొమ్మిది మంది వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు. మూడో తేదీన అన్ని ఆధారాలను సమర్పించబోతున్నాం.*
*వీసీలు ఇచ్చిన రాజీనామాల్లో ఏపీ ప్రభుత్వం నుంచి సూచనలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నట్లు రాశారు. బలవంతంగా చేయించారనేది దానిని బట్టి అర్థమవుతోంది.*
*వీసీల వద్దకు వెళ్లి టీడీపీ గుండాలు బెదిరించి రాజీనామాలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా సమర్పిస్తాం. ఈ ఘటనలపై మీడియాలో వచ్చి కథనాలు, వీడియోలను కూడా అందచేస్తాం* .
*రెండు రోజుల్లో రాజీనామా చేయాలంటూ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి. వీసీలపై దాడులకు తెగబడిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు.*