*కూటమి ప్రభుత్వ పాలన – కీచక పర్వాన్ని తలపిస్తున్నది…* -ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన.. *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే *కిలివేటి సంజీవయ్య గారు..మరియు వైఎస్ఆర్సిపి మహిళా నేతలతో కలిసి* .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
• మాజీ మంత్రి విడుదల రజిని గారు, దళిత మహిళ ఎంపీటీసీ కల్పన గారి పట్ల.. పోలీసులు వ్యవహరించిన తీరు.. సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.
•భారత దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చి .. వారిని అన్నింట ముందు ప్రోత్సహిస్తుంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల పట్ల కర్కశంగా, అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
👉 తెలుగుదేశం పార్టీ నేతల కల్లల్లో ఆనందం కోసం పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని.. పోలీస్ లు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
👉 ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. వారు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.
• మహిళ పట్ల తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరును.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని.. రాబోయే రోజుల్లో..ఈ చర్యకు కచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
*చంద్రశేఖర్ రెడ్డి గారి కామెంట్స్*
👉 11 నెలలుగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు .
👉 ఇచ్చిన హామీలు గాలికొదిలేసి.. అవినీతి అక్రమాలే, ధ్యేయంగా తెలుగు తమ్ముళ్లు చెల్లరేగిపోతున్నారని మండిపడ్డారు.
👉 ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతునొక్కేలా వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనయిస్తుందన్నారు.
👉 రాష్ట్రంలో ఈనెల 9, 10 వ తేదీల్లో జరిగిన వరుస ఘటనలు చూస్తే.. ఈ ప్రభుత్వం మహిళలపై చేస్తున్న దుర్మార్గాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్నారు.
👉 *నిన్నటి రోజున మాజీ మంత్రి విడుదల రజిని..పి ఏ అరెస్టులో భాగంగా* .. రజిని గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు.. సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.
👉 ఒక మాజీ మంత్రిగా.. బి సి మహిళ అయిన విడుదల రజిని గారికి తన పి ఏ ను ఎందుకు అరెస్టు చేస్తున్నారని..పోలీసులను అడిగే హక్కు లేదా అని ప్రశ్నించారు.
👉 ఈ ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పాల్సింది పోయి.. మాజీ మంత్రి అయిన విడుదల రజిని గారిని అవసరం అయితే నిన్ను కూడా అరెస్టు చేస్తాం.. అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ.. ఆమె పట్ల అత్యంత అగౌరవంగా ప్రవర్తిస్తూ.. ఆమెపై దాడికి దిగిన విధానం చూస్తుంటే..ఈ రాష్ట్రం లో ప్రజలకు ప్రధానంగా మహిళకులకు రక్షణ ఉందా అన్న ప్రశ్న ప్రతి ఒక్క మహిళలో కలుగుతుందన్నారు.
👉 అలాగే ఈనెల 9వ తేదీ జరిగిన ఘటన.. గుంటూరు జిల్లా కంతేరు ఎంపీటీసీ దళిత మహిళ అయినటువంటి కల్పన గారి పట్ల..స్థానిక సీఐ ప్రవర్తించిన తీరు.. యావత్ మహిళ లోకాన్నే కించపరిచే విధంగా ఉందన్నారు.
👉 ఎంపీటీసీ కల్పన కుమారుడిపై కొంతమంది కూటమి నేతలు దాడి చేస్తే.. దీనిపై కల్పన గారు..వారి వద్దకు వెళ్ళి ఇదేంటని ప్రశ్నించినందుకు ఆమె పై కూడా దాడి చేసి గాయపరిచారు .తమ కుమారుడు పై దాడిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా .. కల్పన గారు ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి.. దాడి చేసిన కూటమి నేతలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని.. కల్పన గారిని అర్ధరాత్రి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు.
👉 రాత్రి సమయంలో 3:30 నిమిషాలకు.. పోలీసులు కల్పన గారి ఇంటికి వెళ్లి.. కల్పన గారిని అరెస్టు చేస్తున్నామని చెప్పగా.. రాత్రి సమయంలో కల్పన గారు నైటీలో ఉండగా.. చీర మార్చుకుంటాను అని చెప్పిన వినకుండా.. పోలీసులు జీపులో ఒక జంతువుని లాక్కొచ్చినట్లు తీసుకువచ్చి ఎక్కించారని.. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
👉 ఇందుకు సంబంధించి.. కల్పన గారి తల్లి.. మా బిడ్డకు కనీసం చీర కట్టుకునే అవకాశం అయినా ఇవ్వండి అని చెప్పినా వినలేదు. ఇక ఆమె చేసేది లేక ఇంట్లోనుంచి చీర తీసుకొని బయటకు వస్తే.. పోలీసులు ఆ చీర ఇలా ఇవ్వు మేము.. జీపులో కడతాము.. అని మగ పోలీసులు మాట్లాడటం.. మహిళ లోకాన్నె.. అవమానించే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
👉 ఇలా తెలుగుదేశం పార్టీ పాలనలో.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. అత్యంత జుపుక్సాకరమన్నారు.
👉 ఒక బీసీ మహిళ, దళిత మహిళల పట్ల.. కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును.. ఈ రోజు మహిళ లోకం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
• *మాజీ మంత్రి విడుదల రజిని గారి పట్ల, అలాగే కంతేరు ఎంపీటీసీ దళిత మహిళ కల్పన గారి పట్ల.. పోలీసులు వ్యవహరించిన తీరును.. వీడియో ప్రింటేషన్ ద్వారా పాత్రికేయలకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వివరించారు.*
👉 మహిళలను అవమానించిన.. ఏ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో లేదని.. ఎన్నికల్లో ఆ పార్టీ కి తీవ్ర పరాభవాన్ని..ప్రజలు రుచి చూపించిన.. విషయం మనమంతా చూసామని.. తెలుగుదేశం పార్టీకి కూడా రాబోయే రోజుల్లో అదే గతి పడుతుందని హెచ్చరించారు.
👉 ఒకపక్క భారతదేశంలో.. ఆపరేషన్ సింధూర్.. పేరుతో కేంద్ర ప్రభుత్వం ముష్కరులను మట్టు పెడుతుంటే.. భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో.. మహిళలను అగౌరవపరుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని అన్నారు.
👉 ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్..పూర్తిగా అదుపు తప్పిందని.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల విషయంలో పోలీసులు ఇస్టారీతిన వ్యవహరిస్తూ..వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ..కక్ష్య సాధింపు చర్యలకు దిగతూ.. అధికారి పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
👉 ఏపీ లో లిక్కర్, గంజాయి, డ్రగ్స్.. విపరీతంగా దొరుకుతుండడంతో రాష్ట్రంలో నిమిషానికొ హత్య.. చోటు చేసుకుంటూ.. సగటు మనిషికి భద్రత కరువైందని అన్నారు.
👉 ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా మహిళలందరూ.. తీవ్ర నిరసన తెలియజేస్తున్నారన్నారు.
👉 రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ఇలాగే వ్యవహరిస్తే.. మహిళలే రోడ్డు మీదకు వచ్చి తిరుగుబాటు చేసి.. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద, కార్పొరేటర్ కామాక్షి దేవి, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 11వ డివిజన్ ఇంచార్జ్ మహేష్ యాదవ్.. మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.