*కూటమి ప్రభుత్వం సమష్టి కృషితో విశాఖ ఉక్కుకు ఊపిరి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
– విశాఖ స్టీల్ కు 11వేల 440 కోట్ల కేంద్ర ఆర్ధిక సహాయం.
– విశాఖ ఉక్కు పూర్వ వైభవం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతోనే సాధ్యం.
– ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కుమారస్వామి గార్లకు ధన్యవాదాలు
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను 11వేల 440 కోట్ల ఆర్ధిక సహాయం సాధించి ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ధన్యావాదాలు తెలియజేశారు. కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు పునరుద్ధరణకు చంద్రబాబు గారు చేసిన కృషిని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కుమారస్వామి గార్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో విశాఖ ఉక్కు పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, నేడు కూటమి ప్రభుత్వం సమష్టి కృషితో విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమైందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు పూర్తి సామర్ధ్యంతో పని చేస్తే రాష్ట వ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికుల సమిష్టి కృషితో నష్టాల బారిన పడ్డ స్టీల్ ప్లాంటును లాభాల దిశగా నడిపించాలని ఆకాంక్షించారు. స్టీల్‌ప్లాంట్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమేన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విశాఖ స్టీల్ కు ఈ దుర్గతి పట్టిందని ఆమె ఆవేదన. గత ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తెస్తానని హామీ యిచ్చిన 11వేల 440 కోట్ల ఆర్ధిక ప్యాకేజి సాధించి మాట నిలబెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారిని ఆమె కొనియాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానుందన్న ప్రచారాలను వమ్ము చేస్తూ భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గార్లకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజే శారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ ఆర్ధిక ప్యాకేజి సాధించడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అభినందనలు తెలిపారు.