
*కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యకి తూట్లు*- వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశం లో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత వాగ్దానాలు చేయడం పరిపాటిగా మారింది అన్నారు.
కూటమి ప్రభుత్వం వైద్య విద్యలోకి పి.పి.పి(పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్)విదానాన్ని తీసుకురావడం చాలా బాధాకరం అన్నారు.
ఈ విదానం ద్వారా వైద్య కళాశాలలు కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్లిపోయి ఎంబీబీఎస్ చదువుకోవాలనే పేద విద్యార్థుల కలలు నాశనం అవుతాయి అన్నారు. అంతేకాకుండా కళాశాలకి అనుసందానంగా ఉండే జనరల్ హాస్పిటల్ లో ఎన్నో లక్షల మంది పేదవారు ఉచితంగా వైద్యం చేయించుకోలేరు అన్నారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా ఎప్పడు లేని విధంగా 17 వైద్య కళాశాలలు నెలకొల్పేలా ఆదేశాలు ఇచ్చారు, అంతేకాకుండా మొదటి దఫాగా నిర్మాణ పనులకు 2500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అన్నారు. సుమారు 80% పూర్తి అయిన కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ శక్తులకు దారదత్తం చేయడం బాధాకరం అన్నారు.
వైద్య కళాశాలలు తాము నిర్వహించలేమని 1800 సీట్లు వెనక్కి తీసుకోవలసిందిగా అని ప్రభుత్వం ఇండియన్ మెడీషియల్ కమిషన్ కు లేఖ రాయడం సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా కమిటీ లోని సభ్యులు అదేవిధంగా జిల్లా లోని అన్ని నిజోయకవర్గ కమిటీలతో కలిసి విజయవాడ లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ గారిని కలిసి వైద్య విద్యార్థుల గోడు వెళ్లబోస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి సతీష్ బాబు,నెల్లూరు రూరల్ అధ్యక్షులు రోహిత్ రెడ్డి, కావలి అధ్యక్షులు పామాంజి శ్యామ్, కందుకూరు అధ్యక్షులు అశోక్,సర్వేపల్లి అధ్యక్షులు హేమంత్,ఆత్మకురు అధక్షులు విష్ణు,వెంకీ తదితరులు పాల్గొన్నారు.