*”కూటమి పాలనలో రైతులకు తీవ్ర కష్టాలు” -కాకాణి*
*కూటమిపాలన పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని సాధారణ ఎన్నికలు గానీ, జమిలీ ముందస్తు ఎన్నికల్లో గానీ కూటమికి ఘోర ఓటమి ఖాయం.*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:10-03-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు*
*మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ..*
👉 కూటమిపాలన పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని సాధారణ ఎన్నికలు గానీ, జమిలీ ముందస్తు ఎన్నికల్లో గానీ కూటమికి ఘోర ఓటమి ఖాయం.
👉 చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట ఓట్లు దండుకొని, ప్రజలను దారుణంగా మోసగించాడు.
👉 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పేరిట ప్రజల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తానని, మొక్కుబడిగా నలుగురికి జమ చేసి, మహిళలను మోసం చేశాడు.
👉 మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు అంటూ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయినా, జిల్లాకే పరిమితం చేస్తానని మరో మోసానికి లీకులు ఇస్తున్నాడు.
👉 రైతులకు అన్నదాత సుఖీభవ పేరిట గత సంవత్సరం డబ్బులు ఎగ్గొట్టి, ఈ సంవత్సరం బడ్జెట్ లో చాలీ..చాలని నిధులు కేటాయించి, నాటకాలు ఆడుతున్నాడు.
👉 తల్లికి వందనం పేరిట చదువుకునే బిడ్డలందరికీ 15వేలు ఇస్తానని ఇప్పటికీ సంవత్సర కాలమైనా ఇవ్వకుండా, వచ్చే సంవత్సరానికి కూడా నామమాత్రపు నిధులు కేటాయించాడు.
👉 ఆడబిడ్డ నిధి పేరిట 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు ఇస్తానని ఓట్లు వేయించుకున్నాక, ఆ ఊసే ఎత్తడం లేదు.
👉 నిరుద్యోగ భృతి పేరిట నిరుద్యోగులందరికీ నెలకు 3వేల రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించి, యువతను నిట్ట నిలువునా మోసం చేశాడు.
👉 చంద్రబాబు మోసానికి నిలువెత్తు రూపమైతే, జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనియతకు ప్రతిరూపమని ప్రజలు చర్చించుకుంటున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా, రైతుల గోడు వర్ణణాతీతం.
👉 రైతులకు అవసరమైన ఎరువుల దగ్గర నుండి, ధాన్యం కొనుగోళ్ల వరకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు తప్పడం లేదు.
👉 నెల్లూరు జిల్లాలో ధాన్యం కోతలు ప్రారంభమైన నేపథ్యంలో, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాడుతాం.
👉 నారాయణరెడ్డిపేట నుండి తోటపల్లి గూడూరు వరకు ప్రధాన రోడ్లు నిర్మించడమే కాకుండా, మార్గమధ్యలో పేడూరు, ఇస్కపల్లి, తోటపల్లి గూడూరు గ్రామాలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం చేయించి, దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న అవస్థల నుండి విముక్తి కలిగించాం.
👉 సోమిరెడ్డి మాత్రం కమీషన్లు, కలెక్షన్లు తప్ప, ప్రజల సమస్యలపై దృష్టి లేదు.
👉 నేను మంత్రిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోడ్లు వేయిస్తే, సోమిరెడ్డి ఆ రోడ్ల ద్వారా అక్రమంగా గ్రావెల్, ఇసుక, మట్టి, బూడిద తరలించి, అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు.
👉 ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ఎవ్వరికీ అవసరం వచ్చినా, తక్షణమే స్పందించి, అన్ని విధాలా ఆదుకొని అండగా నిలుస్తాం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులను అభినందించిన కాకాణి.