*కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా బిజెపి విస్తృత ప్రచారం : బిజెపి నేతలు*
గూడూరు రూరల్ .
మేజర్ న్యూస్. గూడూరు మండలంలోని పలు గ్రామాలలో బుధవారం. మండల బిజెపి అధ్యక్షులు. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో .బిజెపి సీనియర్ నాయకులు నర్రా సంజీవయ్య నాయుడు అధ్యక్షతన పలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారని చేపట్టారు. మేఘనూరు. అయ్యవారిపాలెం. కాండ్ర .వెంకటేష్ పల్లి. తిమ్మసముద్రం. వెందోడు
.కొండ గుంట. వెడిచర్ల.
పాలిచర్ల రాజుపాలెం. మంగళపూరు .పాలిచర్ల గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామాలలో బిజెపి నాయకులకు స్వాగతాలు. హారతులు. అపూర్వ ఆదరణ చూపించారు.ఎర్రటి ఎండన సైతం లెక్కచేయక. కూటమి కార్యకర్తలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇంటింటికి వెళ్లి కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామీణులకు వివరిస్తూ .ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావుకు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కు ఓట్లు వేసి. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు సంజీవ నాయుడు మాట్లాడుతూ. వైఎస్ఆర్సిపి పాలనలో అభివృద్ధి శూన్యం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడా
లంటే ఎన్డీఏ కూటమి విజయం ఎంతో అవసరం అని, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కచాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నమ్మించి మోసగించడంలో ఆరితేరిన వ్యక్తి అని ఈ విషయం ప్రజలంతా గమనిస్తున్నారని, మే 13వజరగబోయే ఎన్నికలలో ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సైకో పాలనలో మనం ఇంకా రాతియుగంలోనే ఉన్నామని, స్వర్ణ యుగంలోకి పోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు ని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు పరచలేని జగన్ రెడ్డి కొత్తగా హామీలు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే స్థానికుడైన డాక్టర్ పాసింసునీల్ కుమార్ ని గెలిపించుకోవాలని, అలాగే ఎన్డీఏ కూటమి బలపరిచిన తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించు కోవాలన్నారు ..ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి కృష్ణారెడ్డి . వరిదిగల రమేష్ యాదవ్ . నిడిగంటి సుబ్రహ్మణ్యం. బిజెపి యువ నాయకులు మధిర సునీల్ కుమార్ ఈదురు శ్రీనివాసులు. బిజెపి క్రస్టర్ అభ్యర్థి వెంకట సుధాకర్ రాజు . చెంచులక్ష్మి. కవిత .నాగభూషణంమ్మ. రాజశేఖర్ బిజెపి కిసాన్ మోర్చా నాయకులు. కృష్ణ.తదితరులు పాల్గొన్నారు.