*కుటుంబ బంధాలు బలపడేందుకే ఏటి పండగ*
*ఏటి పండుగ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ*
*ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి*
నెల్లూరు, జనవరి 16 : అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడేందుకు ఏటి పండుగ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.గురువారం ఉదయం పెన్నా నది ఒడ్డున జరిగే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం (ఏటి పండుగకు) సంబంధించిన ఏర్పాట్లు ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏటి పండుగ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు.
గురువారం సాయంత్రం జరిగే గొబ్బెమ్మ నిమజ్జోత్సవం పండుగలో నెల్లూరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు.
ముఖ్యంగా పెన్నా నదిలో అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించామన్నారు.
.నీటిలో చెత్తాచెదారాలు తొలగించి శుభ్రపరచాలని, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని, ఇక్కడ భక్తులు కూర్చుని తినుబండారాలు, భోజనాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు.
.ఈ ప్రాంతంలోనే జిల్లాలోని తొమ్మిది దేవాలయాల దేవత మూర్తులను ఏర్పాటు చేస్తారని, ఏటి పండుగకు వచ్చే భక్తులు ఆయా దేవతమూర్తులను దర్శించుకునేందుకు తగిన విధంగా బారికేడ్లను నిర్మించాలని సూచించారు.
.అలాగే పెన్నా బ్యారేజ్ పక్కన వాహనాల పార్కింగ్ కి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించామన్నారు.
.సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
.ఇరిగేషన్ మున్సిపల్ పోలీస్ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చక్కగా చేశారని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు
.నిన్న నవాబుపేట లో కనుమ పండుగ సందర్భంగా జరిగిన పాట్వేటర్వేట తెప్పోత్సవానికి లక్షలాదిమంది భక్తులు విచ్చేసారని, గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో బురద మయంగా ఉన్న కాలువకు అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ సహకారంతో ఘాట్లను నిర్మించి సుందరంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు నాయకులు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
……………….
DIPRO, NELLORE