తేదీ: 15/01/2025
కుంభమేళా భారతీయ సంస్కృతికి ప్రతీక, కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు బాధాకరం: చిలకా ప్రవీణ్
బిజెపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “కుంభమేళా వంటి పవిత్రమైన హిందూ ధార్మిక వేడుకలపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని” ఆయన పేర్కొన్నారు.
చిలకా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “కుంభమేళా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఇది పాప క్షయానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మికతను పెంపొందించే మహాసంగమం. ప్రజల విశ్వాసాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హిందూ సమాజాన్ని కించపరచడమే కాకుండా, వారి మనోభావాలను దెబ్బతీయడమే” అని అన్నారు.
కుంభమేళా భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, ప్రతిష్టాత్మకమైన పండుగ. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, మరియు నాసిక్‌లలో నిర్వహించబడుతుంది. భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా పాప విముక్తి మరియు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ పండుగ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందింది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశంగా ప్రసిద్ధి చెందిన కుంభమేళాకు కోట్లలాది భక్తులు హాజరవుతారు.
“మతపరమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందనీ,భారతీయ జనతా పార్టీ ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, వారి విశ్వాసాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది” అని స్పష్టం చేశారు.