*కిసాన్ మేళాలతో రైతులకు బహుళ ప్రయోజనాలు*
*వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు కూటమి ప్రభుత్వంలో పూర్వవైభవం*
*జాతీయ స్థాయిలో అమలయ్యే పథకాలన్నీ తిరిగి ఏపీ రైతులకు*
*నెల్లూరు వ్యవసాయ పరిశోధన సంస్థలో నిర్వహించిన కిసాన్ మేళాలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను పరిశీలించి ఆయా పరికరాల ఉపయోగాలను తెలుసుకున్న సోమిరెడ్డి*
*రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు నివత్తి చేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులకు ప్రత్యేక అభినందన*
*అందుబాటులో ఉన్న పరికరాలు, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపు*
*సోమిరెడ్డి కామెంట్స్*
దేశానికి అన్నం పెట్టేది రైతులే
వ్యవసాయ సంబంధిత సమస్యలపై పోరాడే విషయంలో రైతులు కొంత వెనుకబడ్డారు
రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలులోకి తెస్తున్నాయి
అన్నదాతలను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది
రైతులకు ఎంతో ఉపయోగపడే కిసాన్ మేళాలను ఐదేళ్లలో రెండు మాత్రమే నిర్వహించి సరిపెట్టుకున్నారు
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగానికి 63 వేల కోట్లు ఖర్చుపెట్టారు
పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం గత ఐదేళ్లలో రూ.80 వేలు కోట్లు ఖర్చుపెట్టాల్సివుండగా రూ.22 వేలు మాత్రమే పెట్టారు
ఇరిగేషన్ కాలువల్లో పూడిక తీయకుండానే తీసినట్టు బిల్లులు చేసుకున్నారు
రైతు ప్రయోజనాలతో ముడిపడిన వ్యవసాయ శాఖతో పాటు ఇరిగేషన్ శాఖను కూడా మూతేశారు
ప్రభుత్వాలు మారుతుంటాయి..కానీ రైతులు, రైతు బిడ్డలు, వ్యవసాయం శాశ్వతం
రైతుల విషయంలో మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోంది
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు పూర్వవైభవం తీసుకొస్తోంది
ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది
జాతీయ స్థాయిలో అమలయ్యే అన్ని వ్యవసాయ పథకాలను తిరిగి ఏపీలోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు
త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ – అన్నదాత సుఖీభవ నిధులు రూ.20 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు