కిటకిటలాడుతున్న తిరుమల
సర్వదర్శనానికి 24 గంటల సమయం
రెండు కిలోమీటర్ల మేర వేచి ఉన్న భక్తులు
*తిరుపతి జిల్లా..తిరుమల*
*💥భక్తులతో కటికటలాడుతున్న తిరుమల* 💥
*👉సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం, 2 కిలోమీటర్ల పైన వేచి ఉన్న భక్తులు..*
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు, దీంతో తిరుమలగిరిలు భక్తులతో నిండిపోయాయి, వేసవి సెలవులు కావడం రాష్ట్రంలో ఎన్నికల ముగియడంతో సాధారణ ప్రజలు, ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకోవడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది…
టోకన్లు లేని సర్వదర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు మొత్తం, నారాయణగిరి షెడ్డులు భక్తులతో నిండిపోయాయి,బయట రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లలో స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు త్రాగునీరు,అన్న ప్రసాదం,పాలు తదితర సౌకర్యాలను ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరిప్రసాద్ టిటిడి భద్రతాధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లు ను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు ఈ రద్దీ మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే పరిస్థితి ఉంది..