*కావలి ని నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా శాసనసభ్యులు కావ్యకృష్ణా రెడ్డి పని చేస్తున్నారు.*
*వైసీపీ నేతల వేధింపులకు వైసీపీ దళిత కార్యకర్తలే ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నాడు కావలిలో వైసీపీ హయాంలో నెలకొంది.*
*పరామర్శ కు వస్తున్న లోకేష్ ను రానివ్వమని మీసాలు తిప్పి, తొడలు కొట్టి వ్యంగ్య విమర్శలు చేసిన వైసీపీ నేతలు నేడు కావలికి రావాలంటే గజగజా వణుకుతున్నారు.*
*ఎన్.టి.ఆర్.విగ్రహాన్ని కూల్చి నాడు ఘోర తప్పిదం చేశారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నాటి 5 ఏళ్లలో వైసీపీ నేతలు కూల్చివేతలకే పరిమితం అయ్యారు.*
*పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారి సహకారం తో రామాయపట్నం, బీపీసీఎల్ సాధించుకుంటాం. ఎయిర్ పోర్టు సమస్య పరిష్కరించుకుంటాం.*
*- బీద రవిచంద్ర, శాసన మండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*
కావలి పట్టణం లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ ,ఎమ్మెల్యే మరియు కూటమి ముఖ్య నేతలతో కలిసి శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు.
*సమావేశంలో బీద మాట్లాడుతూ..*
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ల నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిపోతున్నాయి.
గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థల్ని చంద్రబాబు నేడు గాడిలో పెడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక సహాయమందిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణ పునః ప్రారంభ పనుల శంఖుస్థాపన కొరకు మే 2 న రానుండడం శుభ పరిణామం.
వైసీపీ హయాంలో కావలి నియోజకవర్గం లో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయి. శాసనసభ్యులు గా వెంకటకృష్ణారెడ్డి ఎన్నికైనప్పటి నుండి కావలిని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు.
కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణం లో జాతీయ జెండా ఆవిష్కరణ సంతోషదాయకం. ప్రముఖుల చిత్రపటాలు ఏర్పాటు చేసి కావలి సెల్ఫీ అని మంచి కార్యక్రమం వారు చేపట్టడం అభినందనీయం.
గతంలో కావలిలోని తుమ్మలపెంటకు రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ వచ్చినప్పుడు 3 రోడ్లు నిర్మిస్తామని మాటిచ్చి వెళ్లారు. (తుమ్మలపెంట రోడ్డు, అల్లూరు రోడ్డు , బుచ్చి దగదర్తి రోడ్డు).
వైసీపీ ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలన లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. రోడ్ల నిర్మాణం కోసం అనేక ధర్నాలు, నిరసనలు నాడు చేపట్టాం. అయినా ప్రజా సమస్యల పై నాటి ప్రభుత్వం ఏనాడు స్పందించలేదు.
తెదేపా హయాంలో 90 శాతం పూర్తి అయిన డ్రింకింగ్, వాటర్ స్కీము పనులను 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి.
5 ఏళ్ల వైసీపీ పాలన లో ఎన్టీఆర్ హౌసింగ్ ను కూడా పూర్తి చేయలేకపోయారు. ఒక్క మంచినీటి పథకం, ఒక్క రోడ్డు, ఒక్క బిల్డింగ్, ఒక్క కాలువ నిర్మించిన పాపాన వైసీపీ ప్రభుత్వం పోలేదు.
ఇవేవీ చేయకపోగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చారు. వైసీపీ హయాంలో కూలదోయడం, కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం తప్పితే 5 సంవత్సరాలు చేసింది ఏమీలేదు.
వైసీపీ హయాంలో కావలిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తే ఇప్పటికీ సమాధానం లేదు. నేడు కావ్యకృష్ణా రెడ్డి శాసనసభ్యులుగా గెలిచాక వైసీపీ నాయకుల ఇంటి ముందు ఉన్న గుంటలను సైతం పూడ్చారు.
కావలిలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇతనేమీ టీడీపీ నేత కాదు, దళితుడైన వైసీపీ కార్యకర్త. అయినప్పటికీ వైసీపీ నాయకుల దురాగతాలకు కరుణాకర్ బలయ్యారు.
కరుణాకర్ కుటుంబానికి పరామర్శించేందుకు నారా లోకేష్ గారు వస్తే వైసీపీ నాయకులు మీసాలు తిప్పారు. తొడలు గొట్టారు. లోకేష్ ను ఉద్దేశించి వ్యంగ్యం గా మాట్లాడారు. లోకేష్ ను కావలిలో అడుగు పెట్టనివ్వమని శపథాలు చేశారు.
అధికారం ఉంది కదా అని నాడు చెలరేగిపోయి, కావలిని పోలీసుల రాజ్యంగా మార్చిన వైసీపీ నాయకులు నేడు కావలిలో అడుగు పెట్టటానికి గడ గడ వణకిపోతున్నారు.
వైసీపీ నాయకులకు సంబంధించిన కాలేజీల నుండి మురుగు నీరు బయటికి వస్తోందని, దళిత కాలనీ మీదుగా మురుగునీరు పారుతున్నాయని ప్రశ్నించిన టీడీపీ యువత అధ్యక్షుడిని తెచ్చి మోకాళ్ల మీద నిలబెట్టి, అతను క్షమాపణ చెప్పాలని కోరిన ఘనులు వైసీపీ నేతలు.
చంద్రబాబు కావలికి వచ్చిన రోజునే ఆ దళితుడు వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వైసీపీ నేతలకు టీడీపీ ని విమర్శించే హక్కు లేదు.
5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాం లో అనేక తప్పులను చేశారు. ప్రస్తుతం కావలి ప్రజలు 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనను మరచి ప్రశాంతంగా జీవిస్తున్నారు.
కావలిలో నాటి వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ఎదురొడ్డి అన్ని పార్టీలు కలిసి పోరాటాలు చేశాయి. సేవ్ కావలి అనే నినాదంతో కావలిని కాపాడుకున్నాయి.
వైసీపీ పాలనలో సంక్షేమం కోరుతూ కావలి ప్రజలు రోడ్లెక్కి ఉద్యమాలు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తోంది.
కావలిలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి, అరాచకాలకు బయటికి తీసి ఒక్కోటిగా చక్కబెడుతున్నాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి భవిష్యత్తులో కావలిని నెంబర్ వన్ చేస్తారు.
నీతి నిజాయితీతో పాలన అందిస్తామని ఆయన గతంలోనే ప్రజలకు మాటిచ్చారు. ఒకవేళ అనుకోకుండా తప్పులు జరిగినా సరిదిద్దుకుంటానని చెప్పి గొప్ప మనసు చాటుకున్నారు.
టీడీపీ, జనసేనతో కలిసి ముందుకు సాగుతాం. ఎయిర్ పోర్టు సమస్య ను పరిష్కరించుకుంటాం. బిట్రగుంట రైల్వే సాధించుకుంటాం. ఎంపీ సహకారం తో రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్ సాధిస్తాం.