కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్ గా విధుల కేటాయింపు
నెల్లూరు నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ వర్కర్ గా పనిచేస్తూ మరణించిన బర్రె యేసు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా అతని కుమారుడు బర్రె చిన్న కు 54 వ డివిజన్ నందు పబ్లిక్ హెల్త్ వర్కర్ గా విధులను కేటాయిస్తూ కమిషనర్ శ్రీ.యం.సూర్య తేజ ఉత్తర్వులు జారీ చేశారు.
కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం కారుణ్య నియామకం పత్రంను బర్రె. చిన్న కమిషనర్ నుంచి అందుకున్నారు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. చైతన్య పాల్గొన్నారు.