*కాకాణీ…ఏ గూట్లో దాక్కున్నావ్* *కేసులకు అదరనన్నావ్..అరెస్టులకు బెదరనన్నావ్…ఇప్పుడు ఏమైపోయావ్* *దేశంలోనే ఉన్నావా…విమానం ఎక్కి ఉడాయించావా* *దుబాయ్ లో దాక్కున్నావని మీ వైసీపీ నేతలే చెబుతున్నారు..నిజమేనా* *అక్రమ మైనింగ్ తో వందల కోట్లు దోచేసిన నువ్వు ఫలితం అనుభవించక తప్పదు* *మీ బ్లాస్టింగుల కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన వరదాపురం గిరిజనుల గోష్ట నీకు తగలక తప్పదు* *నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమనాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్, గాలి రామకృష్ణారెడ్డి*

Byjanahushaar.com

Apr 5, 2025

*కాకాణీ…ఏ గూట్లో దాక్కున్నావ్*

*కేసులకు అదరనన్నావ్..అరెస్టులకు బెదరనన్నావ్…ఇప్పుడు ఏమైపోయావ్*

*దేశంలోనే ఉన్నావా…విమానం ఎక్కి ఉడాయించావా*

*దుబాయ్ లో దాక్కున్నావని మీ వైసీపీ నేతలే చెబుతున్నారు..నిజమేనా*

*అక్రమ మైనింగ్ తో వందల కోట్లు దోచేసిన నువ్వు ఫలితం అనుభవించక తప్పదు*

*మీ బ్లాస్టింగుల కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన వరదాపురం గిరిజనుల గోష్ట నీకు తగలక తప్పదు*

*నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమనాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్, గాలి రామకృష్ణారెడ్డి*

*సమావేశంలో పాల్గొన్న కనుపూరు కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వర్దినేని మస్తాన్ నాయుడు, సీనియర్ నాయకుడు పొన్నూరు రామకృష్ణయ్య*

వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెలరేగిపోయారు..సర్వేపల్లి నియోజకవర్గంలో పంచభూతాలను దోచేశారు

పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్ లో జరిగిన అక్రమ మైనింగ్ ను అప్పటి ప్రతిపక్ష నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సాక్షిగా ప్రజల ముందుపెట్టారు

మైనింగ్ లో భాగంగా భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో చేసిన బ్లాస్టింగ్ లతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని గిరిజనులు వేడుకున్నా నాటి పాలకులు పట్టించుకోలేదు

అమాయక గిరిజనుల ప్రాణాలను పణంగా పెట్టి మైనింగ్ కొనసాగించారు. ప్రశ్నించిన వారిపై తమ ప్రతాపం చూపించారు

సోమిరెడ్డి మైన్ సందర్శించినప్పుడు రిగ్ బ్లాస్టింగ్ మిషన్, ప్రొక్లెయిన్లు, డంపర్లు, పేలుడు పదార్థాలు వెలుగుజూశాయి

కాకాణి ఆధ్వర్యంలో జరిగిన వేలాది టన్నుల క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ పై అధికారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు

మొన్నటి దాకా కేసులను ఎదుర్కొంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి జబ్బలు చరిచాడు..ప్రెస్ మీట్లు పెట్టి రోజుకో రీతిలో రెచ్చిపోయాడు

సింహపురి సింహాన్ని అన్ని ప్రగల్భాలు పలికాడు..తీరా పోలీసులు నోటీసులు ఇవ్వగానే పత్తాలేకుండా పారిపోయాడు

నోటీసుకే బెదిరిపోయిన కాకాణి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతాడు..ఏం భరోసా కల్పిస్తాడు

అసలు దేశంలో ఉన్నాడా..విదేశాలకు పారిపోయాడా..హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాల్లో దాక్కున్నాడా

నెల్లూరులో ఒక ఫొటో పెడతాడు..హైదరాబాద్ లో మరో ఫొటో పెడతాడు. చిక్కడు దొరకడులా మాయమైపోతాడు

కలుగులో ఎలుక దాక్కున్నట్టు దాక్కుని…అప్పుడప్పుడు బయటకు వచ్చి వాట్సాప్ లో తొంగి చూచిపోతున్నాడు

ఫొటోలు మార్ఫింగ్ చేసి తలకాయలు మార్చడం కాకాణికి మొదటి నుంచి అలవాటే..ఇప్పుడే అదే అలవాటును కొనసాగిస్తున్నట్టున్నాడు

ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో చెలామణి కావాలంటే వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయి కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కోవాలని హితవు పలుకుతున్నాం

కాకాణి వెంటనే కలుగులో నుంచి బయటకు రాకపోతే పోలీసులు నాదస్వరం ఊదైనా బయటకు తేవడం ఖాయం

అధికారంలో ఉన్నప్పుడు లెక్కకు మించి పాపాలు చేసి ఇఫ్పుడు దాక్కోవడం నాయకుడి లక్షణం కాదని కాకాణి గుర్తుంచుకోవాలి

కరోనా ప్యాలెస్ లో ఖాళీగా కూర్చుని నిత్యం ప్రెస్ మీట్లు పెడతాడు…పిట్టలదొర మాదిరిగా నోటికొచ్చినట్టు అనర్గళంగా మాట్లాడుతాడు..ఇప్పుడేమో పోలీసులు నోటీసులివ్వగానే తుస్సుమన్నాడు

కాకాణి ప్రగల్భాలు విన్న ప్రజలు ఇప్పుడు ఆయన పారిపోవడం చూసి నవ్వుకుంటున్నారు

రాష్ట్రంలో విలువలు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది… కాకాణి గోవర్ధన్ రెడ్డి తర్వాతే

సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాకాణి హయాంలో అనేక నేరాలు ఘోరాలు జరిగాయి

అధికార అహంకారంతో చెలరేగిపోయాడు..అక్రమ కేసులు, ఆస్తుల విధ్వంసంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు..ఇప్పుడేమో ఒక్క కేసుకే మాయమైపోయాడు

వరదాపురం రుస్తుం మైన్ లో అక్రమ మైనింగ్ జరగకుండానే సోమిరెడ్డి సత్యాగ్రహం చేశారా

గుమ్మడికాయల దొంగలు ఎవరంటే..వైసీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారు

మగోడిని, మొనగాణ్ణి అనే బీరాలు పలికే కాకాణి ఇలా పారిపోతాడని మేం అనుకోలేదు

వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణికి తెలియకుండా చీమైనా కుట్టే పరిస్థితి లేదు..అలాంటిది అక్రమ మైనింగ్ విషయం ఆయనకు తెలియదనడం హాస్యాస్పదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed