*కాకాణి సర్టిఫై చేస్తే మందల శేషయ్య వ్యక్తిత్వం అమోఘమైపోతుందా*
*వెంకటాచలం మండలంలో ఎక్కడ ఆరా తీసినా శేషయ్య ఎన్నెన్ని పాపాలు చేశాడో తెలుస్తుంది*
*అన్యాయానికి గురైన మహిళకు అండగా నిలవాల్సిందిపోయి తన ముఠా సభ్యుడిని వెనకేసుకురావడం కాకాణి వ్యక్తిత్వానికి నిదర్శనం*
*నా మీద మూడు అక్రమ కేసులు బనాయించినప్పుడు కాకాణికి యాదవులు, బీసీలు గుర్తుకు రాలేదా..*
*2019లో వైసీపీ పాలన మొదలైందే బీసీలపై దాడులు, కక్షసాధింపులు, వేధింపులతోనే..*
*సోమిరెడ్డితో రాజకీయ పోరాటం చేయలేక ఐదేళ్లూ అమాయకులను అక్రమ కేసులతో వేధించిన కాకాణి గట్స్ గురించి మాట్లాడటమా*
*గోవర్ధన్ రెడ్డీ…నువ్వు చేసిన పాపాలకు ఇక గెలిచేది లేదు..పొడిచేదీ లేదు…కాస్త ఆ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు*
*వెంకటాచలంలో మండల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత సండి రమేష్ యాదవ్*
మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయిన మందల శేషయ్య గురించి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
శేషయ్య వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని, ఆయన వ్యక్తిత్వం అమోఘమని కాకాణి చెప్పడం చూసి వెంకటాచలం ప్రజలు నవ్వుకుంటున్నారు
కాకాణి సర్టిఫై చేస్తే శేషయ్య వ్యక్తిత్వం అమోఘం అయిపోతుందా..
దొంగల ముఠా నాయకుడు తన అనుచరులను మంచోళ్లను చెప్పక దొంగలని ఒప్పుకుంటాడా
గోవర్ధన్ రెడ్డి వీధుల్లోకి వచ్చి శేషయ్య మంచోడని గుండెలు బాదుకున్నంత మాత్రానా ఆయన మంచోడైపోతాడా
లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి అండగా నిలవాల్సిందిపోయి నిందితుడికి వత్తాసు పలకడాన్ని సర్వేపల్లి ప్రజలు చీదరించుకుంటున్నారు
కాకాణికి చిత్తశుద్ధి ఉంటే బాధిత మహిళను పలకరించిన తర్వాత మాట్లాడాలి
ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక మహిళ ఏ స్థాయిలో వేధింపులకు గురైవుంటే పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుందోనని సామాన్యుడు కూడా ఆలోచిస్తున్నాడు
కాకాణి మాత్రం అవేమి పట్టించుకోకుండా తన దొంగల ముఠాలోని సభ్యుడిని వెనకేసుకురావడం దుర్మార్గం
శేషయ్య చేసిన పాపాలు, అమాయకులను గురిచేసిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు
అబద్ధాలను కాకాణి గోవర్ధన్ రెడ్డి తన పేటెంట్ గా మార్చుకున్నాడు
మందల శేషయ్య చేసిన పాపాలే ఆయన్ని ఈ రోజు శాపాలై వెంటాడుతున్నాయి
ఈ రోజు యాదవ సామాజికవర్గం వేధింపులకు గురవుతోందని కాకాణి అంటున్నాడు
2019 జూన్ లో సర్వేపల్లి గడ్డపై వైసీపీ పాలన మొదలైందే బీసీలపై వేధింపులు, కక్షసాధింపులతోనే
అదే సామాజిక వర్గానికి చెందిన నాపై గతంలో మూడు అక్రమ కేసులు బనాయించినప్పుడు యాదవులు గుర్తుకు రాలేదా…ఆ రోజు కాకాణి బుద్ధి ఏమైంది
కాకాణి మీద, ఆయన అనుచరులపై లెక్కలేనన్ని కేసులున్నా రౌడీషీట్లు లేవు
నా మీద మూడు అక్రమ కేసులు బనాయించి రౌడీషీటు ఓపెన్ చేసినప్పుడు కాకాణికి యాదవుల ప్రయోజనాలు గుర్తుకురాలేదా
గతంలో పోలీసులను అడ్డుపెట్టుకుని వెంకటాచలం మండలంలో కాకాణి, ఆయన అనుచరులు చేసిన అవినీతి, అక్రమాలు, దందాలకు లెక్కేలేదు
వెంకటాచలంలో ప్రజల మధ్యకు వెళ్లి ఆరా తీస్తే శేషయ్య చేసిన పాపాలన్ని తెలుస్తాయి..
ఈ రోజు ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చిన తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు…కానీ బయటకు రాని వారెందరో
ఏదేని కష్టం, సమస్య వచ్చి శేషయ్యను ఆశ్రయిస్తే లైంగికంగా ఎలా వేధించాడో బాధిత మహిళలను అడిగితే చెబుతారు..
వెంకటాచలం పంచాయతీలోనే కాదు మండల పరిధిలో ఎక్కడ విచారించినా శేషయ్య వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది
ఇప్పుడు గుండెలు బాదుకుని మాట్లాడుతున్న గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన శిష్యుడు శేషయ్య అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేసిన బాధితులు ఎందరో
బీసీ వర్గానికే చెందిన యనమల రాజేంద్ర వైసీపీని వీడి టీడీపీలో చేరాడని అక్రమ కేసులు బనాయించి 50 రోజులు జైలులో పెట్టించారు
వైసీపీ పాలనలో ముగ్గురు అమాయకులను బలితీసుకున్న ఎస్సై కరిముల్లాపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి వత్తాసు పలికిన కాకాణి ఈ రోజు పోలీసు అధికారులను బెదిరించడం విచిత్రంగా ఉంది
గత ఐదేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి అండ్ బ్యాచ్ చేసిన అవినీతి, అక్రమాలకు అంతే లేదు
అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రాజకీయంగా పోరాడే దమ్ము,ధైర్యం లేక అమాయకులైన కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్న కాకాణి ఈ రోజు గట్స్ గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తోంది
కాకాణి ఇక గెలిచేది లేదు..పొడిచేదీ లేదు..ఇకనైనా ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం మానుకోవాలని హితవు పలుకుతున్నాం