*కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం… ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*

నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. *నగర నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

*చంద్రశేఖర్ రెడ్డి గారి కామెంట్స్..*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో పోలీసులు రోజుకు అక్రమ కేసు బనాయించి.. ఇష్టా రీతిలో వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు*

👉 *మరోపక్క టిడిపి నేతలు..గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయారని.. విదేశాలకు వెళ్లుంటారని.. ఏవేవో అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తూన్నారని మండిపడ్డారు.*

👉 *ఇలా మాట్లాడుతున్న టిడిపి నేతలు..ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉంది.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చు కానీ ఇలాంటి.. అసత్య ఆరోపణలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు తనపై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో.. న్యాయపరంగా రక్షణ పొందేందుకే యాంటీస్ పేటరీ బెయిల్ కు అప్లై చేశారని తెలిపారు.*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కి సంబంధించిన బెయిల్ ఉత్తర్వులు.. రావడానికి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందున.. ఆయన న్యాయ సంప్రదింపులకు అందుబాటులో ఉండేందుకే.. కొంత సమయం తీసుకుంటున్నారని తెలిపారు.*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై.. అసత్య వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని టిడిపి నేతలకు హితవు పలికారు.*

👉 *జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు.. రాజకీయాల్లో ప్రజలకు విశేష సేవలు అందించిన వ్యక్తి అని గుర్తుచేశారు.*

👉 *అక్రమ మైనింగ్ కేసులో.. గోవర్ధన్ రెడ్డి గారు ఎలాంటి విచారణకైనా సిద్ధమని.. పారిపోయే నైజం ఆయనది కాదన్నారు.*

👉 *ఈరోజు టిడిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నాయన్నారు .*

👉 *ప్రజాస్వామ్యంలో ఇలా ప్రతిపక్ష నేతలపై.. ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. కేసులు నమోదు చేసే సంస్కృతి ఎక్కడా లేదన్నారు .*

👉 *న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థే.. ఇలా అక్రమ కేసులు బనాయిస్తూ.. ఉంటే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై రుస్తుమ్ మైన్స్ లో అనుమతులు లేకుండా నాలుగు నెలల పాటు తన అనుచరుల ద్వారా ఇల్లీగల్ మైనింగ్ జరిపారు అనే అభియోగం మోపి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని తెలిపారు.*

👉 *ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన పోలీసులు అక్రమ కేసు నమోదు చేసే సంస్కృతి ఎక్కడ లేదన్నారు.*

👉 *టిడిపి రాజకీయ కక్ష సాధింపు.. చర్యలో భాగంగా ఇలా కేసులు నమోదు చేసే సంస్కృతికి తెరలేపిందన్నారు.*

👉 *అధికార పార్టీ నేతలు.. చెప్పిందానికి పోలీసులు ఊకొడుతున్నారే తప్ప.. ఎక్కడ నిష్పక్షపాతంగా.. వ్యవహరించడం లేదని ఆరోపించారు.*

👉 *ఇలా ఉంటే రేపు పోలీసు వ్యవస్థ ద్వారా.. ప్రజలకు ఏమి న్యాయం జరుగుతుందని.. ఆవేదన వ్యక్తం చేశారు.*

👉 *అలాగే మైన్స్ లో పేలుడు పదార్థాలు.. దొరికాయన్న.. అభియోగంపై మరో కేసు.. దళితులను దూషించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు.. ఇలా ఇష్టా రీతిలో పోలీసులు కాకాని గారి పై అక్రమ కేసులు నమోదు చేస్తూ అధికార పార్టీకి.. పోలీసులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.*

👉 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల పై. అక్రమ కేసులు నమోదు చేసి.. సమాజంలో వారిని అవహేళన చేయడమే.. లక్ష్యమన్నట్టుగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్న తీరు దారుణం అన్నారు.*

👉 *గతంలో టిడిపి నేతలు ఈ మైన్స్ విషయంలో.. అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపించిన సమయంలో.. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై విచారణకు ఆదేశించారాని తెలిపారు.*

👉 *విచారణలో అధికారులు.. ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడంలేదని.. క్లీన్ చిట్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు.*

👉 *అయినప్పటికీ అవేమీ.. పట్టవన్నట్లు.. ఈ మైన్స్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి.. వారి ద్వారా తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించి.. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ అడ్డగోలుగా నమోదు చేశారని ఆరోపించారు.*

👉 *గతంలో తనపై పెట్టిన కేసులు విషయంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి.. ఇవన్నీ అవాస్తవాలని.. తెలియజేశారని అన్నారు.*

👉 *ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిపై.. కేవలం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి.. ఇబ్బంది పెట్టాలన్న.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ కేసులు నమోదు అవుతున్నాయని ఆరోపించారు.*

👉 *ఇలా పోలీసులు నమోదు చేస్తున్న కేసులు.. చూస్తూ ప్రజలు.. ముక్కున వేలేసుకుంటున్నారని.. ఈ విధంగా కూడా కేసులు నమోదు చేస్తారా అని.. ప్రజలు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్న పరిస్థితి వచ్చిందన్నారు.*

👉 *ఇదేవిధంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వ్యవహరిస్తే.. నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న 10 మంది ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా బయట తిరగ్గలడా అని ప్రశ్నించారు.*

👉 *రేపు మా ప్రభుత్వం.. వచ్చినప్పుడు ఇలాంటి కేసులే మేము నమోదు చేస్తే.. ఒక్కరు కూడా తప్పించుకోగలరా అని టిడిపి నేతలను ప్రశ్నించారు.*

👉 *ఇలా పూటకో సెక్షన్లు మారుస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసు వ్యవస్థపై.. ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.*

👉 *ఇలా కేసులు నమోదు.. చేసుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని.. న్యాయ పోరాటం చేస్తూ.. చట్ట ప్రకారం రక్షణ పొందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.. ఎక్కడికో పారిపోలేదని.. యాంటీసిపేటరీ బెయిల్ వచ్చిన లేదా రాకపోయినా తీర్పు వచ్చిన తరువాత ఆయన విచారణకు హాజరు అవుతారు మరియు సహకరిస్తారని తెలిపారు.*

👉 *అయితే ప్రతిపక్ష నేతలపై.. అక్రమ కేసులు బనాయిస్తూ.. టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. దుర్మార్గమన్నారు.*

👉 *కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై.. ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని టిడిపి నేతలకు హితవు పలికారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed