• కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారిని విస్మరించడం సిగ్గుచేటు
  • -నుడా చైర్మన్ కోటంరెడ్డి.

తెలుగు జాతి గర్వించదగ్గ మహా రాజనీతిజ్ఞుడు పి వి నరసింహారావు అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పి వి గారికి ఘనంగా నివాళులర్పించారు.

మాజీ ప్రధాని పి వి నరసింహారావు 20 వ వర్ధంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తెలుగు వాడుగా పీవీ గారు చరిత్ర సృష్టించారని, మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ఒడుదుడుకులు లేకుండా పాలించడమే కాకుండా సంస్కరణలతో దేశానికి దశ దిశా నిర్దేశించిన మహా రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. అటువంటి పీవీ గారిని కాంగ్రెస్ పార్టీ విస్మరించడం సిగ్గుచేటు అని, చివరకు పీవీ పార్థివ దేహాన్ని కూడా సరిగా దహన సంస్కారాలు చేయకుండా అవమానించారని దుయ్యబట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో విభేదాలున్నప్పటికి తెలుగు వాడు ప్రధానిగా పోటీ చేస్తుంటే మన అభ్యర్థిని పోటీకి పెట్టగూడదు అని నంద్యాలలో పీవీ పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టని విషయాన్ని ఈ సందర్భంగా కోటంరెడ్డి గుర్తు చేశాడు. అటువంటి మహనీయుడిని సంస్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని పివిని కోటంరెడ్డి కొనియాడారు.

కార్యక్రమం నిర్వాహకుడు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నేత పీవీ అని, ఐటి రంగాన్ని విస్తృత పరచడం ద్వారా కోట్లాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత పీవీ గారికే దక్కిందని అన్నారు.

పి వి గారి సంస్కరణల కారణంగా దేశం ప్రగతి బాట పట్టిందని, ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టు మిట్టాడినా భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిందంటే అది పీవీ ఘనత మాత్రమే అని ఉచ్చి అన్నారు. పీవిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, పార్థివ దేహాన్ని కూడా ఢిల్లీ లో వుంచకుండా అవమానించారని ఉచ్చి విమర్శించారు.

ప్రధానిగా పని చేసిన పీవీ తన పై పెట్టిన కేసులలో లాయర్లకు ఫీజులు చెల్లించడానికి వంగర లోని తన ఇంటిని అమ్మేసారంటే వారి నిజాయతీ కి ఇదే నిదర్శనం అని శ్లాఘించారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుడ్లడిన వాసుదేవరావు, కామేశ్వర ప్రసాద్, సీ వీ ఎల్ నరసింహం, పద్య సారస్వత పరిషత్ సభ్యులు పొలవరపు నరసింహారావు, దుర్గా ప్రసాద్, ఆకుల హనుమంతు రావు,తానే మస్తాన్, అంచురు శ్రీనివాసులు, పెంచల్ చౌదరి,సుభాన్ బాషా, భార్గవ రాం, ఎలమంద రెడ్డి, జి వి రెడ్డి, గోపాల్ నాయుడు, మౌళి, శ్రీనివాస రావు, అమరా మోహన్ రావు, ఎంపీ ఆంజనేయులు, సుగుణమ్మ, గౌసియా స్థానిక నేతలు, ప్రజలు, పీవీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed