*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు (డీసీసీ) గా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*

*కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడిగా ఆయన ఇప్పటివరకు క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను గుర్తించి ఈ మేరకు డిసిసి అధ్యక్షులుగా ఆయనను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి, తో పాటు ఏఐసీసీ పెద్దలు తనకు పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతుగా కష్టపడి పని చేస్తానని తెలియజేశారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed