
*కర్మ కృతువుల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన విపిఆర్ దంపతులు*
మనిషి మరణించాక చేసే కర్మ కృతువులు ఆత్మీయత, అనుబంధాలకు నిదర్శనమని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు
బుచ్చిరెడ్డి పాళెం పట్టణం 12 వ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గతో కలిసి కైలాస భూమికి అనుసంధానంగా కర్మ కాండలు నిర్వహించే భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో శిథిలావస్థకు చేరిన కర్మ కృతువులు నిర్వహించే భవనం స్థానంలో నూతన భవన నిర్మాణానికి ఆయన 25 లక్షలు ఎంపి లాడ్స్ నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ కర్మ కృతువులు లాంటి అత్యవసర పనుల కోసం ఎంపి లాడ్స్ నిధులు అందచేయడం చాలా సంతోషంగా వుందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారితో కలిసి బుచ్చిరెడ్డి పాళెం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
బుచ్చి పట్టణ మెయిన్ రోడ్డు నిర్మాణానికి 8. 5 కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని 800 కోట్ల పెట్టుబడితో రెండు మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఫిబ్రవరిలో శంఖుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని అభినందిస్తూ 2 వేల 700 ఎకరాలున్న ఇఫ్కో సెజ్ లో పారిశ్రామిక అభివృద్ధి గురుంచి రాష్ట కేబినెట్ లో చర్చ జరిగిన విషయాన్ని ఎంపి వేమిరెడ్డి గారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమల స్థాపనతో కోవూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అభిస్తాయనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి చొరవను ఎంపీ వేమిరెడ్డి గారు ప్రశంసించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు తాను గుర్తించిన ప్రధాన సమస్యల్లో స్మశాన వాటికల సమస్య ఒకటన్నారు. కోవూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలలో ఇప్పటికి స్మశాన వాటికలు లేవని, కొన్ని చోట్ల కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక చాలా గ్రామాలలో స్మశాన వాటికలకు స్థల కేటాయింపులు ఎంపి వేమిరెడ్డి గారి సహకారంతో సి ఎస్ ఆర్ మరియు ఎంపి లాడ్స్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక బుచ్చి పట్టణంలో జరిగిన రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనుల గురించి వివరించారు. బుచ్చి పట్టణంలోని ఇస్కపాళెం రోడ్డు మరియు మంగలి కట్ట ప్రాంతాలలోని స్మశాన వాటికలలో కాంపౌండ్ వాల్స్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. గాంధీనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న కర్మ కృతువుల భవన నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ మున్సిపల్ కమీషనర్ డి బాలకృష్ణ. ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ గౌరవాధ్యక్షులు టంగుటూరి మల్లికార్జున్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు. వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్ లతో పాటు కొన్సిలర్లు, టీడీపీ యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీ కన్వీనర్లు, బిజెపి, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.