*కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు డ్రైను కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన మెట్లు, ర్యాంపులు, ఇతర నిర్మాణాలను  తొలగింపు*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక వాహబ్ పేట ప్రాంతంలో డ్రైను కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన మెట్లు, ర్యాంపులు, ఇతర నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గురువారం తొలగించారు.

పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో వాహబ్ పేట ప్రాంతంలో ఉదయం పర్యటించిన కమిషనర్ డ్రైను కాలువల ఆక్రమణలను గుర్తించి జరిమానాలు విధించారు, నిర్మాణాలను యంత్రాల సహాయంతో వెంటనే తొలగించాలని ఆదేశించారు.

డ్రైను కాలువలలో మురుగునీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించేందుకు, పూడికతీత పనులను చేపట్టేందుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed