*కన్నులపండువగా కామాక్షితాయి అమ్మవారి కల్యాణోత్సవం*
– పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లిఖార్జునసమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి కామాక్షితాయి అమ్మ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
కన్నులపండువగా సాగిన కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. శివనామ స్మరణతో జొన్నవాడ మార్పోగిపోయింది.
స్వామి అమ్మవార్ల కల్యాణం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని స్వామి సన్నిధికి చేరుకున్న ప్రశాంతమ్మ… ఆలయ ఉత్సవ కమిటీతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ప్రశాంతమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వదించి ఆమెకు తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ సేవా కమిటీ ఛైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ పెంచలయ్య, బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.